నిర్మాతగా బాబీ.. అల్లు అరవింద్ ఫుల్ హ్యాపీ

రామానాయుడు వారసత్వాన్ని సురేష్ బాబు అందుకున్నారు. అశ్వనీదత్ వారసత్వాన్ని కుమార్తెలు స్వప్న, ప్రియాంక అందుకున్నారు. మరి మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ వారసత్వాన్ని అందుకునేది ఎవరు? మొన్నటివరకు ఈ ప్రశ్నకు సమాధానం లేదు. కానీ ఇవాళ్టితో దీనికి ఓ సమాధానం దొరికింది. అతడి పేరు అల్లు వెంకటేష్ అలియాస్ బాబి.

ఎట్టకేలకు అల్లు వెంకటేష్, మెయిన్ స్ట్రీమ్ ప్రొడక్షన్ లోకి ఎంటరయ్యాడు. వరుణ్ తేజ్ హీరోగా ఓ కొత్త సినిమాను ఈరోజు లాంఛ్ చేశారు. కాకపోతే ఇది గీతాఆర్ట్స్ బ్యానర్ పై రావడంలేదు. ఈ ప్రాజెక్టు కోసం వేరే వాళ్లతో కలిసి ఓ బ్యానర్ స్టార్ట్ చేశాడు బాబి. తండ్రి అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. మొత్తమ్మీద ఈ ప్రాజెక్టుతో అల్లు బాబి, యాక్టివ్ ప్రొడ్యూసర్ గా మారినట్టయింది. భవిష్యత్తులో గీతాఆర్ట్స్ వ్యవహారాలు చూసుకునేది ఇతడే అనేది ఇప్పుడు పక్కా అయింది.

అల్లు అరవింద్ కు ముగ్గురు కొడుకులు. వాళ్లలో ఇద్దరు ఆల్రెడీ హీరోలయ్యారు. అల్లుఅర్జున్ టాప్ హీరోగా కొనసాగుతుండగా, అల్లు శిరీష్ కెరీర్ పడుతూలేస్తూ సాగుతోంది. ఎప్పటికైనా అతడి జీవితాశయం హీరోనే. ఇక మిగిలింది అల్లు వెంకటేష్ మాత్రమే. ఇన్నాళ్లూ రకరకాల వ్యాపారాలు చేశారు వెంకటేశ్. అమెరికాలో కూడా కొన్ని ప్రయత్నాలు చేశారు. అదే టైమ్ లో వ్యక్తిగతంగా కూడా కొన్ని ఇబ్బందులు చవిచూశారు.

తాజాగా మరోసారి పెళ్లి చేసుకున్న వెంకటేశ్, ఇప్పుడు తండ్రి బాటలో మెల్లమెల్లగా అడుగులు వేస్తున్నారు. గతంలో గీతాఆర్ట్స్ బ్యానర్ లో ఆయన చిన్నచిన్న పనులుకే పరిమితయ్యారు. అల్లు అరవింద్ కూడా వెంకటేష్ ను ఎప్పుడూ తన ఫీల్డ్ లోకి రమ్మని బలవంతం చేయలేదు. తెరపైకి కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. ఇన్నాళ్లకు చుట్టూతిరిగి తండ్రి బాటలోకే వచ్చాడు పెద్దకొడుకు బాబి. ఎట్టకేలకు అల్లు అరవింద్ హ్యాపీ. 

వరుణ్ తేజ్ కొత్త సినిమా ఓపెనింగ్ ఫొటోస్ కోసం క్లిక్ చేయండి

Show comments