విజయ్-వన్ మంత్ ప్రాక్టీస్

విజయ్ దేవరకొండ డ్యాన్స్ లు విరగదీస్తున్నాడు. బెంగళూరు, కోచ్చిలో ఇప్పటికే విజయ్ లేటెస్ట్ సినిమా డియర్ కామ్రేడ్ మ్యూజిక్ ఫెస్టివల్ పేరిట ఆ సినిమా ప్రమోషన్లు జరిపారు. చెన్నయ్ లో ఈరోజు, హైదరాబాద్ లో శుక్రవారం, విశాఖలో ఈనెల 24న ఈ తరహా ప్రీరిలీజ్ ఫంక్షన్ కమ్ మ్యూజిక్ ఫెస్టివల్స్ వున్నాయి. ఇప్పటి వరకు జరిగిన రెండు ఫంక్షన్లలో విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి పాటలకు డ్యాన్స్ లు విరగదీసారు.

వాస్తవానికి విజయ్ కు డ్యాన్స్ లు అంత అలవాటు కాదు. కానీ ఈ సినిమా ప్రమోషన్ ఇలా చేయాలని ముందుగానే డిసైడ్ అయ్యాడట. అలా అయిన వెంటనే నెలరోజులు అన్ని పనులు పక్కనపెట్టి, కేవలం పాటలకు డ్యాన్స్ ప్రాక్టీస్ చేసాడట విజయ్. ఈ ప్రాక్టీస్ కోసం అటు క్రాంతిమాధవ్ సినిమా, ఇటు హీరో సినిమా రెండింటికీ గ్యాప్ ఇచ్చేసాడట.

యు/ఎ
ఇదిలావుంటే డియర్ కామ్రేడ్ సెన్సారు ఫార్మాలిటీ పూర్తి చేసుకుంది. యు/ఎ సర్టిఫికెట్ వచ్చింది. మైత్రీ మూవీస్ నిర్మించిన ఈ సినిమాకు భరత్ కమ్మ దర్శకుడు. స్టూడెంట్ యూనియన్ రాజకీయాలు, క్రీడల్లో కోచ్ ల రాజకీయాల నేపథ్యంలో అల్లుకున్న కథతో డియర్ కామ్రేడ్ సినిమా తెరకెక్కించారు. ఈనెల 25న విడుదలకు సినిమా రెడీ అవుతోంది.

బ్యూటిఫుల్ హీరోయిన్ తో క్యూట్ యాంకర్ ఇంటర్వ్యూ

పూరి చూసిన ఎత్తుపల్లాలు ఏమిటి

Show comments