బొత్స రాజకీయం ఎటు వైపు?

నాలుగు దశాబ్దాల సుదీర్ఘమైన రాజకీయ జీవితం గడిపిన సీనియర్‌ నేత వైసీపీకి చెందిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ రాజకీయ పయనం ఎటు అన్న చర్చ సాగుతోంది. ఆయన పక్క చూపులు చూస్తున్నారని అధికార పక్షం నేతలతో పాటు ప్రచారం కూడా సాగుతోంది. ఈ పుకార్లకు ఫుల్‌స్టాప్‌ అయితే పడడంలేదు.

బొత్స అయితే ప్రస్తుతానికి రాజకీయంగా కొంత విరామం ప్రకటించారని అంటున్నారు. ఆయన రాజకీయ జీవితంలో ఇది మరో సంక్లిష్టమైన పరిస్థితిగానే చూస్తున్నారు.

2019లో  అంతా తన వారినే గెలిపించుకుని హవా చాటిన బొత్స ఇపుడు తనతోపాటు అందరి ఓటమిని స్వయంగా చూస్తున్నారు. బొత్స రాజకీయంగా పదవీ విరమణ ప్రకటిస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది.

కానీ ఆయన మంత్రిగా ఉన్నపుడు ఉపాధ్యాయుల బదిలీల విషయంలో అవినీతికి పాల్పడ్డారు అంటూ అధికార టీడీపీ నేతలు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో ఆయన రాజకీయంగానే దీనిని ఎదుర్కోవాల్సి వస్తోంది. Readmore!

అయితే బొత్స కుటుంబంలో ఆయన తమ్ముడు గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య, బొత్స సతీమణి మాజీ ఎంపీ బొత్స రaాన్సీలక్ష్మి రాజకీయంగా తప్పుకున్నట్లే అని అంటున్నారు.

రానున్న రోజులలో వైసీపీలో బొత్స కుటుంబం నుంచి ఎంతమంది చురుకుగా ఉంటారన్నది చూడాల్సి ఉంది అంటున్నారు.

Show comments