ఈసీని అడ్డం పెట్టుకుని కూట‌మి అమాన‌వీయం!

పేద‌ల సంక్షేమానికి అడ్డు ప‌డొద్ద‌నే ఉద్దేశంతో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సైతం ఎన్నిక‌ల సంఘం లెక్క చేయ‌డం లేదు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పేద‌ల‌కు ఆర్థిక ప్ర‌యోజ‌నం క‌లిగించొద్ద‌నే ఏకైక ల‌క్ష్యంతో ఈసీని అడ్డం పెట్టుకుని కూట‌మి వారి జీవితాల‌తో ఆడుకుంటోంద‌న్న విమ‌ర్శ వెల్లువెత్తుతోంది.

రైతుల‌కు ఇన్‌ఫుట్ స‌బ్సిడీ, విద్యా దీవెన‌, మ‌హిళ‌ల‌కు ఆస‌రా, చేయూత‌, ఈబీసీ ల‌బ్ధిదారుల‌కు శుక్ర‌వారం లోపు నిధులు జ‌మ చేసేంతుకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. అంత‌కు ముందు ఈసీ అడ్డుకోవ‌డంతో ఆయా ప‌థ‌కాల ల‌బ్ధిదారులు హైకోర్టును ఆశ్ర‌యించారు. సుదీర్ఘ విచార‌ణ అనంత‌రం ల‌బ్ధిదారుల ఖాతాల‌కు డ‌బ్బు జ‌మ చేసేందుకు ఒక రోజు స‌మ‌యాన్ని ఏపీ ప్ర‌భుత్వానికి ఇచ్చింది.

ఈ మేర‌కు హైకోర్టు ఆదేశాల‌ను ఈసీ దృష్టికి ప్ర‌భుత్వం తీసుకెళ్లింది. అయితే సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్ధి క‌లిగించ‌డానికి ఈసీ స‌సేమ‌రా అంటోంది. రూ.14 వేల కోట్ల‌కు పైగా సంక్షేమ ప‌థ‌కాల బ‌ద్ధిదారుల‌కు జ‌మ చేయ‌డానికి ఎలా స‌మ‌కూర్చుకున్నారు?  ఇప్పుడే అత్య‌వ‌స‌రంగా ఎందుకు వేయాల‌నే య‌క్ష ప్ర‌శ్న‌ల‌ను ప్ర‌భుత్వానికి ఈసీ సంధించ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. గ‌తంలో ఇదే ఎన్నిక‌ల సంఘం చంద్ర‌బాబునాయుడు ప‌సుపు-కుంకుమ కింద ఒక్కో మ‌హిళ‌కు రూ.10 వేలు చొప్పున ఇవ్వ‌డానికి ఎలాంటి కోడ్ అడ్డురాలేదు.

అలాగే తెలంగాణ‌లో తాజాగా ఆర్థిక ప్ర‌యోజ‌నాలు క‌లిగించ‌డానికి ఈసీ అడ్డుప‌డ‌లేదు. కానీ ఏపీలో టీడీపీ, జ‌న‌సేన‌తో బీజేపీ పొత్తులో వుండ‌డం, రాజ‌కీయంగా జ‌గ‌న్‌ను ఎదుర్కోలేక‌, ఆయ‌న‌కు అండ‌గా నిలిచిన పేద‌ల క‌డుపు కొట్ట‌డానికి అమాన‌వీయంగా ప్ర‌వ‌ర్తిస్తోంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. దీనికి ప్ర‌ధానంగా కూట‌మిలోని మూడు పార్టీలే కార‌ణ‌మ‌ని పేదలు ఆగ్ర‌హంగా ఉన్నారు. వ్య‌వ‌స్థ‌ల స‌హ‌కారం అంటే, ఇలా పేద‌ల‌పై క‌క్ష తీర్చుకోడానికి అనుకోలేద‌నే వాద‌న వినిపిస్తోంది.

Readmore!

Show comments