అది ఒక్కటే ట్రంప్ కార్డ్!

అన్ని హామీలు.. అన్ని మాటలు.. ఇప్పుడు గాలికిపోతున్నాయి. ఒక్కటే తరుపుముక్క తెలుగుదేశం కూటమి చేతికి చిక్కింది. అదే భూ హక్కు పరిరక్షణ చట్టం. దాని మీదే అన్ని ప్రసంగాలు, అన్ని మాటలు, అన్ని ప్రకటనలు. అన్ని హామీలు. అంతా దాని చుట్టూనే. అటు అధికార పక్షం అనుకోలేదు.. ఇది ఇలా టర్న్ తీసుకుంటుందని, ఇటు ప్రతిపక్షం అనుకోలేదు. ఇలాంటి ఆయుధం ఒకటి లాస్ట్ మినిట్ లో చేతికి అందుతుందని.

ప్రభుత్వం ముందుగా మేలుకోలేదు. వాస్తవం ఇంకా రెడీ కాలేదు. దాంతో అబద్దం డ్రెస్ వేసుకుని జనాల్లోకి పరుగెట్టేసింది. ఇప్పుడు జనం అంతా అదే నిజమని నమ్ముతున్నారు. జిరాక్స్ కాపీలు కాదు, ఒరిజినల్స్ నే ఇస్తారు రిజిస్ట్రేషన్ టైమ్ లో అని చెప్పినా నమ్మడం లేదు. చట్టంలో కొన్ని లోటు పాట్లు వున్నాయి. కానీ మంచి చేసే అవకాశం వుంది అని చెప్పినా పట్టించుకోవడం లేదు. చంద్రబాబు ఇప్పుడు పూర్తిగా ఈ చట్టం ప్రాతిపదికగా తన ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.

ఈ మేరకు అనేక వీడియోలు చేసి వదులుతున్నారు. ఫుల్ పేజీ ప్రకటనలు ఇస్తున్నారు. వీటిని అధికారం పక్షం నుంచి ఖండించేది కేవలం జగన్ ఒక్కరు మాత్రమే. దీనికి కౌంటర్ వీడియోలు లేవు. వివరణలు లేవు. వైకాపా లీగల్ సెల్ జనాల క్లారిటీ లేదు. ఫుల్ పేజీ ప్రకటనలు లేవు. పోలింగ్ ఇక రెండు రోజుల్లోనే వుండడంతో అంతా ఆ హడావుడిలో వున్నారు. ఈలోగా ప్రతిపక్షం ఇదే చట్టం ఆధారంగా చేయాల్సిన డ్యామేజ్ అంతా చేసుకుంటూ పోతోంది.

Readmore!
Show comments