విశాఖతో జగన్ సెంటిమెంట్ కంటిన్యూ!

వైసీపీ అధినేత జగన్ ఎప్పుడూ విశాఖలో ఎన్నికల ప్రచారం నిర్వహించలేదు. అది 2014 కానీ.. అలాగే చూస్తే 2019 కానీ జగన్ విశాఖ నడిబొడ్డున ఒక్కటంటే ఒక్క ఎన్నికల సభ నిర్వహించిన దాఖలాలు అయితే లేవు.

జగన్ మాతృమూర్తి వైఎస్ విజయమ్మ విశాఖ నుంచి లోక్ సభకు వైసీపీ అభ్యర్ధిగా 2014 ఎన్నికల్లో పోటీ చేసినపుడు కూడా జగన్   విశాఖలో ఎన్నికల ప్రచారం చేయలేదు. అదే ఒరవడిని ఆయన 2019లోనూ కంటిన్యూ చేశారు.

జగన్ 2019లో గాజువాకలో ప్రచారం చేసి వెళ్లిపోయారు. పెందుర్తి తో పాటు విశాఖ రూరల్ జిల్లాలలో జగన్  2019లో ఎన్నికల సభలు ఆనాడూ జరిగాయి కానీ విశాఖలో మాత్రం జగన్ అడుగుపెట్టలేదు. ఈసారి అయినా జగన్ విశాఖలో ఎన్నికల ప్రచారానికి వస్తారు అనుకుంటే గాజువాక సభతోనే ముగించారు.

ఎన్నికల ప్రచారనికి గడువు పూర్తి అవుతోంది. జగన్ మిగిలిన టైం లో ఉత్తరాంధ్రకే రాకపోవచ్చు అని అంటున్నారు. దాంతో జగన్ విశాఖ సెంటిమెంట్ ని అలాగే కొనసాగిస్తున్నారు అని అంటున్నారు. జగన్ 2014, 2019లలో విశాఖలో ప్రచారం చేయకపోయినా వైసీపీ గెలిచింది లేదు. ఇప్పుడు ఆయన ప్రచారం చేయకపోయినా అభ్యర్థులలో సత్తా ఉంటే గెలుపు ఖాయమని వైసీపీ నేతలు అంటున్నారు.

Readmore!

2024లో విశాఖ సిటీలో వైసీపీ బోణీ కొడుతుందని నాలుగు దిక్కులలో రెండు చోట్ల అయినా వైసీపీ జెండా ఎగురుతుందని ఆ పార్టీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Show comments