‘వైకాపా’కు ‘విజయ’నగరం!

శ్రీకాకుళం చాలా సైలెంట్‌గా, టఫ్ ఫైట్ ను కొంత వరకు, కూటమికి ఎడ్జ్ కొంత వరకు సూచిస్తుంటే విజయనగరం జిల్లా కాస్త భిన్నంగా వుండేలా కనిపిస్తోంది. ఇక్కడ మరీ అంత సైలంట్ గా లేదు.. అలా అని వైలంట్ గానూ లేదు. జనాలు మాత్రం కాస్త హుషారుగానే వున్నారు. కానీ అలా అని బాహాటంగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడం లేదు. తరచు తామర తంపరగా వస్తున్న సర్వే జనాలతో విసిగి వున్నారేమో, ప్రశ్న రాకుండానే, తెలియదు.. చెప్పలేను.. లాంటి పడికట్టు ఆన్సర్ లు ముందే బయటకు వచ్చేస్తున్నాయి.

జిల్లాలో కూటమికి ఎక్కువ హోప్ వున్న స్ధానంగా బొబ్బిలి పేరు వినిపిస్తోంది. కూటమి అభ్యర్ధి బేబి నాయన మీద కన్న, ఆయన కుటుంబ నేపథ్యం ఎక్కువగా కలిసి వస్తున్నట్లు కనిపిస్తోంది. బొబ్బిలిని పాలించిన వంశం కనుక ప్రజల్లో ఇంకా కొంత వరకు అభిమానం వుంది. కానీ కాస్ట్ ఈక్వేషన్లు వుండనే వున్నాయి. ప్రస్తుతానికి జిల్లాలో కూటమికి పక్కాగా వచ్చే సీటు ఏది అంటే మాత్రం బొబ్బిలి పేరే వినిపిస్తోంది. వైకాపా నుంచి పోటీ చేస్తున్న బొత్స కుటుంబీకుల్లో ఇద్దరు గట్టెక్కుతారు అనే టాక్ కూడా జిల్లాలో వినిపిస్తోంది. నిజానికి ముగ్గురు పోటీ చేస్తున్నారు.

పూసపాటి వంశానికి చెందిన అశోక్ గజపతి రాజు తనయ పోటీలో వున్నారు. కానీ ఎందుకో ఆమె గెలుపు మీద జనాల్లో అంత గట్టిగా అభిప్రాయం వినిపించడం లేదు. వైకాపా నుంచి కోలగట్ల పోటీ చేస్తున్నారు. నిజానికి ఆయన మీద మంచి అభిప్రాయమే వుంది కానీ, ఇటీవల తెలుగుదేశం వైపు వున్న నాయకుల బలం పెరిగిందని అంటున్నారు. అందువల్ల గట్టిగా కృషి, ఖర్చు రెండూ ఆ పార్టీ వైపు నుంచి వుందని, పైగా క్షత్రియులు అంతా అశోక్ తనయ విజయం కోసం గట్టిగా కృషి చేస్తున్నారని, అందువల్ల కోలగట్ల విజయం లాస్ట్ మినిట్ వరకు చెప్పలేమని అంటున్నారు.

జిల్లాలో మిగిలిన స్థానాలు పోటా పోటీగా వున్నట్లు కనిపిస్తున్నాయి. నిజానికి పోటా పోటీ అన్న ప్రతి సర్వేలో కలగడానికి కారణం ప్రజలు పెద్దగా ముందుకు వచ్చి మాట్లాడకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. జిల్లాలో వైకాపా కు కాస్త ఆశలు బలంగా వుండడానికి కారణం, ఈ జిల్లాలో ప్రభుత్వ స్కీములు ఎక్కువ మందికి అందడం, ప్రభుత్వ స్కీములు బలంగా అమలు చేయడమే అనే టాక్ అక్కడక్కడ వినిపించింది.

Readmore!

కానీ జిల్లాలో ఇప్పటి వరకు ముందంజలో వుండడానికి కాపు సామాజిక వర్గం ఓ కారణం. తెలుగుదేశం కొప్పల వెలమలను, ఎక్కువ ఎంకరేజ్ చేయడంతో కాపులు వైకాపా లేదా కాంగ్రెస్ వైపు వుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు జనసేన సీన్ లోకి ఎంటర్ అయింది. అందువల్ల ఈసారి సీన్ అంతు పట్టడం లేదు. ఎప్పటి మాదిరిగానే కాపులు బొత్స కోసం పార్టీ వెనుక వుంటారా? ఓట్లు చీలుతాయా? చీలితే ఏ మేరకు అటు ఇటు అవుతాయి అన్న ప్రశ్నలకు సమాధానాలు క్లారిటీగా దొరకడం లేదు.

ఉత్తరాంధ్రలో వైకాపాకు ఎక్కువ సీట్లు వస్తాయి మా జిల్లాలో అని వైకాపా నాయకులు బలంగా నమ్ముతున్నారు అదే చెబుతున్నారు. కానీ ఈసారి తాము కూటమి వైపే వున్నామని కొందరు ఉద్యోగస్తులు మొహమాటం లేకుండా చెప్పారు.

స్కీములు అందుకున్నవారంతా జగన్ కు ఓట్లు వేస్తారా? జగనన్న ఇళ్ల లబ్దిదారులు ఒకరిద్దరిని అడిగితే, తప్పకుండా అనే సమాధానం. మరి అలాంటపుడు ఇక వైకాపాకు ఇంక టెన్షన్ ఎందుకు అంటే మాత్రం నో ఆన్సర్.

మొత్తం మీద జిల్లా లెక్కలు, వైకాపా ధీమా, తేదేపా కష్టం అన్నీ లెక్కలు చూసుకుంటే విజయనగరం జిల్లా కూటమికి కాస్త దూరంగా వున్నట్లు కనిపిస్తోంది. కనపడని వేవ్ వస్తే తప్ప.

Show comments