బాబు సేవకుడిని గెలిపించాలా మెగాస్టార్‌?

మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదిక‌గా వీడియో విడుద‌ల చేశారు. పిఠాపురం ప్ర‌జ‌ల‌కు ఆయ‌నో పిలుపునిచ్చారు. గాజుగ్లాసు గుర్తుపై ఓటు వేసి ప‌వ‌న్‌ను గెలిపించి, చ‌ట్ట‌స‌భకు పంపాల‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. అన్న‌గా త‌మ్ముడి గెలుపును కోరుకోవ‌డం స‌హ‌జ‌మే. ఈ వీడియోలో ఆయ‌న కొన్ని కామెడీ కామెంట్స్ చేశార‌ని నెటిజ‌న్లు త‌ప్పు ప‌డుతున్నారు. 

"అమ్మ క‌డుపున ఆఖ‌రి వాడు, అంద‌రి మేలు కోరే విష‌యంలో మొద‌టివాడు, నా త‌మ్ముడు ప‌వ‌న్‌క‌ల్యాణ్" అని ఆయ‌న గ‌ర్వంగా చెప్పారు. త‌న గురించి కంటే జ‌నం గురించే ఎక్కువ ఆలోచిస్తాడు అని చిరంజీవి చెప్ప‌డంపై నెటిజ‌న్లు దెప్పి పొడుస్తున్నారు. 

ప‌వ‌న్ త‌న కంటే జ‌నం గురించి ఆలోచిస్తాడ‌నే భ్ర‌మ‌లో చిరంజీవి ఉన్నాడ‌నేందుకు ఈ వీడియో నిద‌ర్శ‌న‌మ‌ని నెటిజ‌న్లు వెట‌క‌రిస్తున్నారు. ప‌వ‌న్ నిత్యం చంద్ర‌బాబునాయుడు, ఆయ‌న కుమారుడు లోకేశ్ గురించే ఎక్కువ ఆలోచిస్తార‌ని మెగాస్టార్ చిరంజీవికి తెలియ‌క‌పోవ‌డం, ఆయ‌న అమాయ‌క‌త్వానికి నిలువెత్తు నిద‌ర్శ‌న‌మ‌ని నెటిజ‌న్లు వ్యంగ్యంగా కామెంట్స్ చేయ‌డం విశేషం.

త‌నతో పాటు జ‌న‌సేన బ‌లోపేతం గురించి ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎప్పుడైనా సీరియ‌స్‌గా ఆలోచించి వుంటే, ఈ రోజు మెగా కుటుంబ స‌భ్యులంతా ఇలా పిఠాపురంలో వాలిపోవాల్సిన అవ‌స‌రం వుండేది కాద‌ని వారు అంటున్నారు. జ‌న‌సేన స్థాపించి ప‌దేళ్లు అవుతున్నా, ఇప్ప‌టికీ ఎమ్మెల్యేగా ఎన్నిక కాక‌పోవ‌డం వెనుక‌, త‌న త‌మ్ముడి అల‌స‌త్వం, టీడీపీ ప‌ల్ల‌కీ మోయ‌డ‌మే కార‌ణ‌మ‌ని చిరంజీవికి ఎవ‌రైనా చెబితే బాగుంటుంద‌ని నెటిజ‌న్లు సెటైర్స్ విసురుతున్నారు. 

Readmore!

ప్ర‌జ‌ల కోసం ప‌వ‌న్ నిల‌బ‌డ‌డ‌ని, చంద్ర‌బాబుకు అవ‌స‌ర‌మైన‌ప్పుడు మాత్ర‌మే రాజ‌కీయ తెర‌పైకి వ‌స్తార‌ని గ‌త ప‌దేళ్ల‌లో ఎన్నో ఉదంతాలున్నాయ‌ని చిరంజీవికి నెటిజ‌న్లు తెలియ‌జెప్ప‌డం విశేషం. బాబు సేవ‌కుడు, సైనికుడిగా జ‌గ‌న్‌తో క‌ల‌బ‌డ‌డం త‌ప్ప‌, ప‌వ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు సొంత ఇమేజ్‌ను ఏర్ప‌ర‌చుకోలేకే, క‌నీసం ఎమ్మెల్యేగా అయినా గెలిచేందుకు పొత్తు కుదుర్చ‌కున్నార‌ని నెటిజ‌న్లు ఓ రేంజ్‌లో చిరంజీవి వీడియో స్పందిస్తున్నారు.

Show comments