మోడీ: ఒదిశాలోని కాన్ఫిడెన్స్ ఏపీలో కనిపించలేదే!

‘‘ఒడిశాలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడబోతోంది.. నవీన్ పట్నాయక్ ప్రభుత్వానికి జూన్ 4వ తేదీ ఆఖరి రోజు.. జూన్లో జరగబోయే బిజెపి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి నేను మళ్ళీ హాజరవుతాను..’’ ఇలాంటి డైలాగులు చెప్పాలంటే చాలా చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇంత ధాటిగా ప్రకటన చేయాలంటే ఆ రాష్ట్రంలో తమ పార్టీ డెంకా బజాయించి గెలవబోతున్నదని నమ్మకం కూడా ఉండాలి.

ఒరిస్సా రాష్ట్రం విషయంలో ప్రధాన నరేంద్ర మోడీకి అలాంటి విశ్వాసం పరిపూర్ణంగా ఉంది. అందుకే ఈ డైలాగులను భువనేశ్వర్ లో జరిగిన పార్టీ ప్రచార సభలో ఆయన ప్రజల మీదికి సంధించారు. అంతా బాగానే ఉంది కానీ, ఇదే స్థాయి ఆత్మవిశ్వాసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచార సభలలో మోడీ మాటలలో ఎందుకు కనిపించడం లేదు అనేది అభిమానుల ప్రశ్న?

ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రెండు ఎన్నికల ప్రచార సభలను నిర్వహించారు అయితే ఈ రెండు సభలలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పరిపాలనను ఆయన టార్గెట్ చేసింది చాలా తక్కువ.

సాధారణంగా నవీన్ పట్నాయక్ తో ప్రధాని మోడీ చాలా సన్నిహితంగా ఉంటారు ఈ రెండు పార్టీల మధ్య మంచి అవగాహన ఉన్నదని అభిప్రాయం కూడా పలువురులో వినిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఎన్నికల సమరంలో మాత్రం బిజూ జనతా దళ్ పార్టీ మీద ప్రధాని నరేంద్ర మోడీ నిప్పులు చెరుగుతున్నారు.

Readmore!

అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే నిర్వహించిన ప్రచార సభలలో మోడీ జగన్ సర్కారు మీద చేసిన విమర్శలు అంత తీవ్రంగానే లేవు. జగన్ ల్యాండ్ సాండ్ లిక్కర్ మాఫియాలతో చెలరేకపోతున్నదని అంటూ ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును మక్కికి మక్కి చదవడానికి మాత్రమే ప్రధాని నరేంద్ర మోడీ ఇవాల్టి సభలో పరిమితమయ్యారు. అంతకుమించి జగన్ ప్రభుత్వం మీద సూటిగా చేసిన విమర్శలు లేవు.

చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని అంటున్నారు. కానీ ఆయన ఎంత చెప్పినా వాళ్ళ మాటలు నమ్మి ఓట్లు వేయడానికి ఎవరు సిద్ధంగా లేరు.. అనే వాదన వినిపిస్తుంది.

జగన్ ప్రభుత్వం మీద ద్వేష భావం ఉన్నట్లుగా ఆయన మాటల్లో కనిపించడం లేదు. ఏదో చంద్రబాబునాయుడు ఆబ్లిగేషన్ గనుక మోడీ ప్రచారానికి వచ్చారు తప్ప.. జగన్ ప్రభుత్వం దిగిపోవాలనేకోరిక గానీ, దిగిపోనివ్వకూడదనే వాంఛ గానీ ఆయనలో లేవు. ఆయన ప్రసంగాలు కూడా అదేవిధంగా సుతిమెత్తగానే సాగుతున్నాయి. ఫలితాలు వచ్చిన తర్వాత.. తనకు కావాల్సిన మిత్రులెవరో అప్పుడు మోడీ డిసైడ్ చేసుకుంటారని ప్రజలు అనుకుంటున్నారు.

Show comments