జగన్ నిలదీతకు బదులేది బాబూ?

తనను బచ్చా అని చంద్రబాబు ఎత్తిపొడిచిన దానికి అనకాపల్లిలో జరిగిన సిద్ధం సభలో ధీటైన జవాబు చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేనే బచ్చాను అయితే 23 సీట్లకు టీడీపీని పరిమితం చేస్తూ బాబుని ఓడించాను అపుడు ఆయన ఏమి కావాలని సూటిగానే నిలదీశారు.

దానికి జవాబు చెప్పమంటూ డిమాండ్ చేశారు. రెండు రోజులు ఆలస్యంగా అదే ఉత్తరాంధ్రలో విజయనగరం జిల్లాలో బాబు జవాబు చెప్పారు. అయితే అది కూడా జగన్ అన్న దానికి కాదు, జగన్ ని బచ్చా అన్నందుకు తెగ ఫీల్ అవుతున్నారు అని సెటైర్లు వేసిన బాబు ఆయన బచ్చా ఎలా అవుతారు బందిపోటు అవుతారు అని మరో ఘాటు విమర్శ చేశారు. రాష్ట్రాన్ని దోచుకున్నారు అని నిందించారు.

బచ్చాను నేను అయితే నీ సంగతేంటి బాబూ అంటే దానికి ధీటైన బదులివ్వడం చేతకాలేదని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. బందిపోటు అని మరో విమర్శ చేయడం ద్వారా బాబు జగన్ ప్రశ్నలకు జవాబు ఇవ్వలేకపోయారు అంటున్నారు.

ఉత్తరాంధ్రకు బాబు చేసిందేమిటి అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తుంటే ఉత్తరాంధ్రాలో మొత్తం సీట్లు అన్నీ టీడీపీకి రావాలని మూడు జిల్లాలూ క్లీన్ స్వీప్ చేయాలని బాబు అత్యాశతో ఉన్నారని అంటున్నారు. అంతా బాగున్నపుడే టీడీపీకి ఎపుడూ కూడా డెబ్బై శాతం కంటే సీట్లు ఉత్తరాంధ్రాలో రాలేదని గుర్తు చేస్తున్నారు.

వైసీపీకి మాత్రం 2019లో ఎనభై శాతం పైగా సీట్లు దక్కాయని గణాంకాలను వైసీపీ నేతలు ముందు పెడుతున్నారు. ఈసారి కూడా వైసీపీ అదే ఫిగర్ ని కంటిన్యూ చేస్తుందని తమకు తగ్గేదే లేదని అంటున్నారు. ఉత్తరాంధ్రకు మేలు చేసిన వైసీపీకే జనాలు ఓటు వేస్తారు అని వారు అంటున్నారు.

Show comments