పవన్ నామినేషన్ కు ఎందుకిలా?

పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నామినేషన్ వేయడానికి భారీ సన్నాహాలు చేసుకున్నారు. కొన్ని వేల మంది వస్తారని అంచనా వేసుకున్నారు. మూడు నాలుగు వేల మందికి భోజనాలు స్పాన్సర్ చేసారు ఓ హోటల్ యజమాని.

చేబ్రోలు సమీపంలోని క్యాంప్ ఆఫీసు నుంచి పిఠాపురం వరకు ర్యాలీగా వెళ్లాలని అనుకున్నారు. వెళ్లారు కూడా. కానీ ర్యాలీలో పాల్గొన్న జనం వందల మంది తప్ప వేలాది మంది కాదు. అప్పటికీ లైవ్ ప్రోగ్రామ్ కవరేజ్ వీలయినంత క్లోజప్ లో చూపించారు.

గమ్మత్తేమిటంటే వెస్ట్ గోదావరి భీమవరం, పాలకొల్లు ప్రాంతాల నుంచి చాలా మంది వచ్చారు. వారితో కలిపితేనే ఈ మేరకు కనిపించిన జనం. పిఠాపురం ఊరి వరకు వెళ్లిన తరువాత రోడ్ల పక్కల వున్న జనం జాయిన్ కావడంతో కాస్త నిండుగా కనిపించింది

లైవ్ కవరేజ్ ను అప్పడప్పుడు ఆపుతూ, చేసుకుంటూ సర్దుబాటు చేసినట్లు కనిపిస్తోంది. కేవలం బైక్ ర్యాలీ మాత్రమే కాస్త భారీగా కనిపించింది. జగన్, చంద్రబాబుల కోసం జనాలు వేలాదిగా వచ్చిన రీతిన‌ పవన్ నామినేషన్ కు కనిపించలేదు.

నిజానికి గోదావరి జిల్లాల్లో, అందులోనూ పిఠాపురంలో పవన్ కు, జనసేనకు వున్న ఊపు గమనిస్తే, ఈ నామినేషన్ కార్యక్రమానికి వేలాదిగా జనం తరలి వస్తారని అనుకున్నారంతా. కానీ ఆ అంచనాల మేరకు అయితే జనం రాలేదు. బహుశా ఎండల తాకిడి కూడా కావచ్చు. లేదా జనసేకరణ అన్నది చేయడంలో పార్టీ విఫలమైన వుండొచ్చు.

Show comments