బచ్చా... జగన్ స్పీచ్ అచ్చా!

టీడీపీ అధినేత చంద్రబాబు జగన్ మీద తీవ్ర స్థాయిలోనే విమర్శలు చేస్తున్నారు. ఆయన గంటల కొద్దీ చేసే స్పీచ్ లో జగన్ ని దూషించడానికే ఎక్కువ టైం కేటాయిస్తున్నారు. జగన్ ని పట్టుకుని బచ్చా నా ముందు నీవెంత అంటూ బాబు మాట్లాడుతున్నారు.

దానికి అనకాపల్లి సిద్ధం సభలో జగన్ అచ్చా అనిపించేలా బాబుకు సరైన కౌంటర్ ఇచ్చారు. ఈ బచ్చానే నిన్ను 23 సీట్లకు పరిమితం చేసింది బాబూ అంటూ గట్టిగానే తగులుకున్నారు. నేను బచ్చానే కానీ నా చేతిలో చిత్తుగా ఓడిన నీవు ఏమిటి, నిన్ను ఏ పేరుతో పిలవాలి బాబూ అంటూ రెట్టించి జగన్ ప్రశ్నించారు. నేను బచ్చాను అయితే అయిదేళ్ల నా పాలన తరువాత కూడా ఒంటరిగా ఎన్నికలకు రాలేని నిన్ను ఎలా అనుకోవాలి. పది మందిని వెంటబెట్టుకుని వస్తున్న నీకు ఏ పేరు పెట్టి పిలవాలి అని జగన్ నిలదీశారు.

నేను అయిదేళ్ళ సీఎంని కానీ ఏపీ దశ దిశ మార్చే పధకాలు తెచ్చాను ఎన్నో సంస్కరణలు చేపట్టాను, మరెన్నో కార్యక్రమాలు చేపట్టాను ఇదీ జగన్ పాలన అని నా మార్క్ చూపించాను. మరి పద్నాలుగేళ్ళ సీఎం అని చెప్పుకునే నీ మార్క్ ఏదీ బాబూ అని జగన్ సూటిగానే నిగ్గదీశారు.

నన్ను తిట్టడమే కాదు నా మీద కోపంతో ఎన్నెన్నో అంటున్నారు. అఖరుకి రాళ్ళేసి కొట్టమంటున్నావు. నేను బచ్చాను మరి నీ తీరుని చూసి ఏమనుకోవాలి అని జగన్ బాబుతో బంతాట ఆడుకున్నారు. అది కూడా బాబు పుట్టిన రోజు పూట ఆయన డెబ్బై అయిదేళ్ళ వయసుని ఎత్తిపెడుతూ బచ్చా అంటున్నావ్ కానీ ఎందుకు భయపడుతున్నావ్ నాకు అని ప్రశ్నలతో కుమ్మేశారు.

ఏపీలో పేదలకు ఏ ఒక్క మంచి అయినా చేయాలన్న ఆలోచన నీ బుర్రకు తట్టిందా బాబూ అని జగన్ నిలదీశారు. నన్ను ఒక్కడిని చేసి ఓడించడానికి ఇంతమంది కలసి వస్తున్నారు. కానీ నాకు ప్రజలే తోడు వారితోనే కలసి వస్తాను మీ పెత్తందారులందరినీ ఓడించేది కూడా పేద ప్రజా సమూహమే అని జగన్ హాట్ కామెంట్ చేశారు.

జగన్ ఆదివారం విశాఖలో రోడ్ షో చేయనున్నారు. విశాఖ పుర వీధులలో జగన్ రోడ్ షో కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 22న విజయనగరంలో 24న శ్రీకాకుళంలో జగన్ సిద్ధం సభలు ఉన్నాయి. దాంతో మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగియనుంది.

Show comments