విశాఖ‌లో విస్తార‌మైన క‌మ్మ రాజ్యం!

తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావ‌డానికి ఒక కులం విప‌రీత స్థాయిలో శ్ర‌మిస్తోంది.ఆ శ్ర‌మ వెనుక ఉన్న రీజ‌న్లు బ‌హిరంగ ర‌హ‌స్యాలే! దేంట్లో అయినా తామే ఉండాలి, త‌మ వాళ్లే ఉండాలి.. ఏపీ త‌మ రాజ్యంగా ఉండాల‌నే ఆస‌క్తే త‌ప్ప ఇంకో ఉద్ధేశం ఏమీ లేదు! అది అమ‌రావ‌తి అయినా, విశాఖ అయినా.. ఎక్క‌డైనా క‌మ్మ రాజ్య విస్త‌ర‌ణే ప‌ర‌మావ‌ధిగా సాగుతోంది ఈ రాజ‌కీయం! జ‌గ‌న్ మూడు రాజ‌ధానుల ఫార్ములాను ప్ర‌తిపాదిస్తే అది త‌మ కమ్మ రాజ్యంపై దాడే అని ఆ వ‌ర్గం వాపోయింది. అయితే అసెంబ్లీ సాక్షిగా ఒక క‌మ్మ ఎమ్మెల్యే నే అయిన కొడాలి నాని విశాఖ‌లో విస్త‌రించిన క‌మ్మ రాజ్య అవ‌శేషాల గురించి ప్ర‌స్తావించారు!

ఆల్రెడీ విశాఖ‌ను మింగేసింది త‌మ వాళ్లే అని కొడాలి నాని వివ‌రించి చెప్పారు. శాన‌స‌భ సాక్షిగానే కొడాలి ఆ వివ‌రాల‌ను వెల్ల‌డించారు! మ‌రి ఇప్పుడు విశాఖ ఎంపీగా చంద్ర‌బాబు నాయుడి కుటుంబీకుడే పోటీ చేస్తున్నాడు. నారా లోకేష్ తోడ‌ల్లుడు, బాల‌కృష్ణ అల్లుడు విశాఖ నుంచి ఎంపీ అభ్య‌ర్థిగా పోటీలో ఉన్నాడు. విశాఖ‌లో విస్త‌రించి ఉన్న క‌మ్మ రాజ్య రక్ష‌కుడిగా శ్రీభ‌ర‌త్ ను చూస్తోంది ఆ వ‌ర్గం! 

కొడాలి నాని వెల్ల‌డించిన వివ‌రాల్లోకి వెళితేనే విశాఖ‌లో విస్త‌రించిన క‌మ్మ రాజ్యం విస్మ‌యాన్ని క‌లిగిస్తుంది! విశాఖ‌లో ఉన్న ఫైవ్ స్టార్ హోట‌ళ్ల‌లో ఏకంగా 80 శాతం క‌మ్మ సామాజిక‌వర్గం చేతిలో ఉన్నాయి. ఆ త‌ర్వాత థియేట‌ర్లు మొత్తం ఈ సామాజిక‌వ‌ర్గానివే! 80 శాతం థియేట‌ర్లు వీరివేనంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు. విశాఖ వంటి న‌గ‌రంలో ఫైవ్ స్టార్ హోట‌ళ్లు, థియేట‌ర్లంటే వీటి విలువ వంద‌ల‌, వేల కోట్లే! థియేట‌ర్ మార్కెట్ విష‌యానికి వ‌స్తే.. మొత్తం ఆ సామాజిక‌వ‌ర్గమే ఆక్ర‌మించింది! థియేట‌ర్ బిజినెస్ లోకి మ‌రొక‌రిని ఇక్క‌డ‌కు రానీయ‌ర‌నేది ప్ర‌ముఖంగా వినిపించే మాట‌! ఎవ‌రైనా ఆ ప్ర‌య‌త్నాలు చేసినా.. వారిని తొక్క‌డంలో వీరి శ‌క్తికి తిరుగులేదు!

స్టార్ హోట‌ళ్లు, మ‌ల్టీప్లెక్స్ లేకాదు.. ఆ త‌ర్వాతి గ్లామ‌ర‌స్ బిజినెస్ కార్ల షోరూమ్ లు. న‌గ‌రంలో ఉన్న ప్ర‌ముఖ కార్ల షోరూమ్ ఓన‌ర్లు క‌మ్మ సామాజిక‌వ‌ర్గీయులే! వీటి ఓన‌ర్ల‌లో తెలుగుదేశం నేత‌లే ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి కావాల్సిన సినిమా న‌టుడు, రియ‌లెస్టేట్ వ్యాపారి ముర‌ళీమోహ‌న్ కూడా విశాఖలో తిరుగులేని శ‌క్తే! ఎక్క‌డో మ‌ద‌న‌ప‌ల్లిలో సినిమా స్టూడియోకంటూ యాత్ర సినిమా మేక‌ర్ కు రెండెక‌రాల భూమిని ప్ర‌భుత్వ ధ‌ర‌కు కేటాయిస్తే.. ప‌చ్చ మాఫియా మామూలుగా ఏడ‌వ‌లేదు! అయితే విశాఖ‌లో 15 ఎక‌రాల భూమిని రామానాయుడు కుటుంబం పొందితే మాత్రం అదంతా అభివృద్దే!

క‌మ్మ వాళ్లకు చంద్ర‌బాబు న‌గ‌రాల న‌డిబొడ్డున భూముల‌ను ధారాద‌త్తం చేస్తే అదంతా అభివృద్దే! విశాఖ‌లో ద‌గ్గుబాటి కుటుంబం ఎక‌రాల కొద్దీ భూములు పొందినా, హైద‌రాబాద్ న‌డిబొడ్డున రాఘ‌వేంద్ర రావు సినిమా అభివృద్ధికి మ‌ల్టీ ప్లెక్స్ క‌ట్టుకోవ‌డానికి ప్ర‌భుత్వ భూమిని కారు చౌక‌గా క‌ట్టబెట్టినా.. క‌మ్మ వాళ్లు కాబ‌ట్టి వారికి పొందే అర్హ‌త ఉన్న‌ట్టు!

హోట‌ళ్లు, మ‌ల్టీప్లెక్స్ లు ఆ త‌ర్వాత కార్ల షోరూమ్ లు, ఇంకా సినిమా స్టూడియోలే కాదు.. హాస్పిట‌ళ్లు కూడా ఈ సామాజిక‌వ‌ర్గం చేతిలోనే ఉన్నాయి విశాఖ‌లో! ఇక గీతం యూనివ‌ర్సిటీ భూములు, ఆక్ర‌మ‌ణ‌లు, ఆ ఆక్ర‌మ‌ణ‌ల తొలిగింపుకు జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నం చేయ‌డం ఇవ‌న్నీ తెలియ‌ని సంగ‌తులు ఏమీ కావు! గీతం భూముల ఆక్ర‌మ‌ణ వ్య‌వ‌హారం గ‌త ఐదేళ్ల‌లో వివిధ సంద‌ర్భాల్లో హాట్ టాపిక్ గా నిలిచిన నేప‌థ్యంలో ఇప్పుడు శ్రీభ‌ర‌త్ స్వ‌యంగా ఎంపీగా బ‌రిలో ఉండ‌టం విశేషంగా మారింది. వంద‌ల కోట్ల రూపాయ‌ల విలువ చేసే భూముల‌ను కాపాడుకోవ‌డానికి భ‌ర‌త్ ఎంపీ హోదా ల‌భిస్తే వప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేయొచ్చు! 

పెద్ద పెద్ద వ్యాపారాలే కాదు. ఓ మోస్త‌రు వ్యాపారాలు కూడా క‌మ్మ వాళ్ల వే విశాఖ‌లో. న‌గ‌రంలో వ‌ర‌స పెట్టి ఉన్న  పెట్రోల్ బంకుల యాజ‌మానులు వారే! విశాఖ‌లో క‌మ్మ వాళ్లంటే.. వారికి ఉన్నన్ని వ్యాపార మార్గాలు, సంపాదించుకునే మార్గాల‌కు లెక్క‌లేదు! అమ‌రావతి రాజ‌ధానికి కాక‌పోయినా.. విశాఖ రాజధాని అయినా అధిక ల‌బ్ధి పొందేది క‌మ్మ వాళ్లే అని స‌భ‌లో కొడాలినాని ఓపెన్ గా వ్యాక్యానించారు. మ‌రి ఇప్పుడు అలా విస్త‌రించిన క‌మ్మ రాజ్యానికి ర‌క్ష‌కుడిగా శ్రీభ‌ర‌త్ ను చూస్తున్న‌ట్టుగా ఉంది ఆ వ‌ర్గం!

విజ‌య‌మ్మ విశాఖ నుంచి పోటీ చేసిన‌ప్పుడు ఆమె గెలిస్తే రాయ‌ల‌సీమ వాళ్లు వ‌చ్చేస్తార‌నే ప్ర‌చారంలో బెంబేలెత్తించారు. అయితే అస‌లు లెక్క విశాఖ‌లో ఉన్న క‌మ్మ రాజ్యానికి ఎలాంటి ఇబ్బంది రానివ్వ‌కూడ‌దనేదే! ఇప్పుడు బొత్స ఝాన్సీ రూపంలో క‌మ్మ వ‌ర్గానికి విశాఖ‌లో గ‌ట్టి ప్ర‌తిబంధ‌కం ఎదుర‌వుతోంది. విశాఖ‌ను క‌మ్మ సామాజిక‌వ‌ర్గం అయిన కాడికి వాడుకోవ‌డ‌మే త‌ప్ప ఉత్త‌రాంధ్ర‌కు చంద్ర‌బాబు ఉద్ధ‌రించింది శూన్యం. ఇలాంటి నేప‌థ్యంలో శ్రీభ‌ర‌త్ రూపంలో డైరెక్టుగా చంద్ర‌బాబు కుటుంబీకుడు, స్థానికంగా భూముల వివాదాల్లో ఉన్న  అభ్య‌ర్థి బ‌రిలో ఉండ‌టంతో టీడీపీకి అద‌న‌పు ప్ర‌తిబంధ‌కంగా మారుతోంది.

Show comments