దూసుకుపోతున్న విశాఖ ఆడపడుచు!!

విశాఖ పార్లమెంటు రాజకీయ ముఖ చిత్రం 

ఒక మహిళ విశాఖ రాజకీయ పరిణామాలను పూర్తిగా మార్చి వేస్తున్నారు. ఆమెను ఎంపీ అభ్యర్థిగా వైసిపి అధిష్టానం ప్రకటించిన తర్వాత  విశాఖ పార్లమెంటు పరిధిలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతూ వస్తున్నాయి. ఆమె పేరే డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి. సీనియర్ నేత, ప్రస్తుత మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి ఈమె. మాస్ లీడర్ గా ఉత్తరాంధ్ర జిల్లాల వాసులకు సుపరిచితులు.

విజయనగరం జిల్లా రాజకీయాలను శాసిస్తున్న బొత్స వర్గం ఇప్పుడు తాజాగా విశాఖపట్నం పైన కన్నేసింది.రెండుసార్లు పార్లమెంటు సభ్యురాలుగా పనిచేసి తనకంటూ మార్క్ వేసుకున్న బొత్స ఝాన్సీ లక్ష్మి విశాఖపట్నం పార్లమెంటు స్థానానికి వైసీపీ అభ్యర్థిగా ఆ పార్టీ అధిష్టానం ప్రకటించిన తర్వాత అత్యంత వేగంతో జనంలోకి వెళ్లి మమేకమవుతూ వారి మన్ననలను అందుకున్న అభ్యర్థిగా చెప్పుకోవచ్చు.

స్థానికురాలు కావడం గాజువాక పారిశ్రామిక ప్రాంతంలోని శ్రీహరిపురంలో ఆమె జన్మించడం ఈ కారణాలన్నీ ఆమెను విశాఖ ఆడపడుచుగా అందరూ అభివర్ణిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పక్కా లోకల్ అనే నినాదం అనేది ఈసారి విశాఖ పార్లమెంటు స్థానానికి ఎక్కువగా వినిపిస్తోంది. స్థానిక ఎంపీలు కావాలి అనే నినాదం తొలి నుంచి ఉత్తరాంధ్రలో ఎక్కువగా ఉంటూ వస్తుంది కానీ రకరకాల రాజకీయ కారణాలవల్ల అన్ని పార్టీలు స్థానికేతరులకు పారాషూట్ నాయకులకు పదవులు ఇచ్చి కాలం గడిపారు. 

ఝాన్సీ బలం ఇదేనా?

విశాఖ పార్లమెంటు స్థానానికి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొత్స ఝాన్సీ లక్ష్మీకి కలిసి వచ్చేఅంశాలు చాలా ఉన్నాయి.ఆమె స్థానికరాలు కావడం,ఒక ప్రధాన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కావడం అలాగే ఎప్పుడు పిలిచినా ఉన్నానంటూ చెప్పి బొత్స కుటుంబ రాజకీయాలు…ఇవన్నీ కూడా ప్రజలను ఆకర్షిస్తున్నాయి.పైగా రెండుసార్లు పార్లమెంటు సభ్యురాలుగా గెలిచిన తర్వాత ఆమె పార్లమెంటులో పలు సమస్యలను ప్రస్తావించడం కూడా ఇప్పుడు ప్రజలు చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ఐరన్ ఓర్ విషయంలో ఆమె చాలా కాలం క్రిందట విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంతగనులు కేటాయించాలని పార్లమెంటు లో డిమాండ్ చేశారు.

ఆ తర్వాత తెలుగు, కన్నడ భాషలకు ప్రాచీన హోదా కల్పించే విషయంలోనూ ఆమె తీవ్రంగానే కృషి చేశారు. ఇలా చాలా సమస్యల విషయంలో డిమాండ్ చేయడంలోనూ పోరాటం లోను పార్లమెంటు సాక్షిగా ఆమె వ్యవహరించిన తీరు ఇప్పుడు విశాఖ ప్రజలను ఆలోచింపజేసే విధంగా మారింది.

విజయనగరం రాజకీయాలను శాసిస్తున్న బొత్స  కుటుంబం విశాఖలో ఉన్న ప్రధాన సామాజిక వర్గం తో పాటు చాలామందితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ నేతగా మంత్రిగా పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన కాలం నుంచి ఇప్పటివరకు కూడా తన అనుచరులను తన నమ్మిన వారిని కాపాడుకుంటూ వస్తారు. ఏ క్షణమైనా ఏ రాత్రైనా తలుపు తెరుస్తారు అన్న నమ్మకం మెజారిటీ ప్రజానీకంలో పెరుగుతోంది.

టీడీపీ అభ్యర్థి లోపాలు

టీడీపీ అభ్యర్ధి లోపాలు వైసిపికి కలిసి వస్తున్నట్లుగా అర్థమవుతుంది.తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు ఎంపీ అభ్యర్థిగా ఉన్న గీతం యూనివర్సిటీ అధినేత భరత్ విషయంలో ఆ పార్టీ శ్రేణుల్లోనే కొంత అసంతృప్తి ఉంది. ఇది కాకుండా కేవలం పార్టీ అండతోనే గెలవాలన్న ప్లాన్ తో భరత్ కృషి చేస్తున్నారు వ్యక్తిగతంగా అతని పట్ల ప్రజల్లో ఎలాంటి ఇమేజ్ లేదు భరత్ కానీ అంత ముందు విశాఖ ఎంపీగా పనిచేసిన అతని తాత ఎంవీవీఎస్ఎస్ మూర్తి గాని విశాఖ ప్రజలకు ఏదైనా ప్రత్యేకంగా చేశారు అన్న మార్క్ అనేది ఏమీ లేదు.

భరత్ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు మళ్ళీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈసారి అనూహ్యంగా స్థానిక నినాదం రావడం అలాగే వైసిపి గట్టి అభ్యర్థిని రంగంలో దించడంతో పరిణామాలు తెలుగుదేశం పార్టీకి ప్రతికూలంగా మారుతున్నాయి మరోవైపు గీతం భూముల కుంభకోణం, కరోనా సమయంలో గీతం ఆసుపత్రిలో జరిగిన అవకతవకలు ఇవన్నీ కూడా ప్రత్యర్థి పార్టీలకు అస్త్రాలుగా మారుతున్నాయి.

ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వ్యక్తి రేపు విశాఖపట్నంకు ఏం చేస్తారు అన్నది ఇప్పుడు వైసిపి తో సహా మిగిలిన పార్టీలు నిలదీసే పరిస్థితి ఏర్పడింది .ఇంతవరకు విశాఖపట్నం అభివృద్ధి చెందలేదు అనేది నినాదంగా చెప్తూ వచ్చిన తెలుగుదేశం పార్టీకి దానికి సరైన రీతిలో కౌంటర్ ఎటాక్ ఇవ్వడానికి వైసిపి సిద్ధమైంది. భరత్  స్థానికుడు కాదు, విశాఖ మీద ప్రేమ కాదు ,తన వ్యాపారం మీదే మోజు అన్న రీతిలో వైసిపి వర్గాలు విస్తృతంగా ప్రచారం చేయడంతో ఇప్పుడు ప్రజల్లో తీవ్రమైన చర్చకు దారితీస్తుంది.

వైసీపీ, టీడీపీ మధ్య తేడా ఇదే!

విశాఖపట్నం స్థానానికి సంబంధించినంతవరకు ప్రచారంలో వైసీపీ దూకుడు పెంచింది.అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి రంగంలో దిగిన తొలి రోజు నుంచి ప్రజల్లో మమేకం కావడం మొదలుపెట్టారు.ఆమె ఇప్పటికే 7 నియోజకవర్గాల పరిధిలో దాదాపుగా ప్రచారం వేగంగా చేస్తున్నారు.

ఎస్ కోట అలాంటి దూరపు ప్రాంతాల్లో తర్వాత రోజుల్లో ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు అక్కడ బొత్స అనుచరగణం ఎస్.కోట ప్రాంతంలో ఉన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు చక్క దిద్దుతోంది అన్నది సమాచారం.

ఇక భీమిలి, గాజువాక, విశాఖ తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ నియోజకవర్గాల్లో బొత్స ఝాన్సీ లక్ష్మి ప్రచారాన్ని విస్తృతంగా చేస్తూ వస్తున్నారు. అటు టిడిపి వైపు నుంచి చూస్తే భరత్ కు ఇంటిలోనే పోరు కనిపిస్తున్నట్లుగా ఉంది. చాలామంది అభ్యర్థులు అన్ని ఎన్నికల ఖర్చులు భరత్ భరించాలని పోరు పెడుతున్నట్లుగా తెలుస్తోంది. పైగా ప్రచారంలో కూడా  భరత్ చాలా వెనకబడ్డారు.

నామినేషన్ వేసిన తర్వాత ప్రచార హోరుని పెంచుతారా లేదంటే, చతికిలపడతారా అన్నది చూడాల్సి ఉంది. మొత్తం మీద చూసుకుంటే ..విశాఖ ఆడపడుచు గా రంగంలో దిగిన బొత్స ఝాన్సీ లక్ష్మి తన మార్కు రాజకీయాన్ని,తన మార్కు పనితనాన్ని,ప్రచారాన్ని చేస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు.

Show comments