టీచర్లలో హర్షం.. సర్కారు స్కూళ్లకు మరింత గౌరవం!

పచ్చకామెర్లు సోకిన మీడియా.. తమ పుచ్చు ఆలోచనలతోనే భాష్యం చెబుతుండవచ్చు గాక. కానీ.. రాష్ట్రంలోని టీచర్లందరూ హర్షామోదాలు వ్యక్తంచేసేలా.. వారు సుదీర్ఘకాలంగా పోరాడుతున్న కోరిక ఒకటి జగన్ సర్కారు నెరవేర్చింది. రాష్ట్రంలో అన్ని రకాల బోధనేతర పనుల నుంచి టీచర్లను తప్పించేలా విద్యాహక్కు చట్టాన్ని సవరించారు. టీచర్లకు పాఠాలు చెప్పడం తప్ప మరో రకం పని అప్పగించకుండా ఉండేలా ఈ చట్టాన్ని సవరించారు. నిజానికి పాఠం చెప్పడం కంటె ఇతర పనులే ఎక్కువైపోతున్నాయంటూ ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తంచేయడం కొత్త సంగతి కాదు. అది ఇప్పటికి నెరవేరింది.

ఈ నిర్ణయం ద్వారా టీచర్లకు ఇతర పనుల భారం తగ్గుతుంది. జగన్మోహన్ రెడ్డి సర్కారు విద్యావ్యవస్థను సమూలంగా సంస్కరించే బాటలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్కూళ్లలోను అన్ని తరగతుల్లోనూ ఇంగ్లిషు మీడియంను కూడా ప్రవేశపెట్టారు. నాణ్యమైన విద్య అందించడం లక్ష్యంగా టీచర్లకు ఓరియెంటేషన్ నిర్వహిస్తున్నారు. హైస్కూలు విద్యార్థులకు మరింత నాణ్యమైన బోధన అందించడానికి బైజూస్ సంస్థతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. 

నాడు నేడు రూపంలో పాఠశాలల రూపురేఖలు.. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ఒక్కటొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు. ఇన్ని రకాల అద్భుతాలు విద్యారంగంలో చోటు చేసుకుంటున్నాయి. ఆ క్రమంలో గవర్నమెంటు స్కూళ్ల మీద ప్రజల్లో గౌరవం పెరగడానికి ఈ నిర్ణయం కూడా దోహదం చేస్తుంది.

టీచర్లు జనాభాగణన, ఎన్నికల నిర్వహణ వంటి అనేకానేక ఇతర కార్యక్రమాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఎన్నికల అధికారులుగా టీచర్లు వెళ్లే ప్రతి సందర్భంలోనూ స్కూళ్లు దాదాపుగా మూతపడుతూ ఉంటాయి. స్కూళ్లలో డ్రాపవుట్స్ కూడా పెరుగుతుంటారు. 

ఇలాంటి అవకతవకలేమీ లేకుండా ఉండడానికి జగన్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. విద్యాహక్కు చట్టాన్ని మార్చింది. కొత్త సవరణల ప్రకారం.. సాధ్యమైనంత మేర ఉపాధ్యాయలు విద్యకు సంబంధించినవి తప్ప ఇతర విద్యేతర పనుల్లో పాల్గొనకూడదు. పిల్లల విద్యాస్థాయులను పెంచడానికి మాత్రమే తమ సమయం కేటాయించాలి. అనివార్య కారణాల వల్ల.. విద్యేతర పనులకు వాడాల్సి వస్తే.. ప్రభుత్వ శాఖల్లోని సిబ్బంది అందరినీ వినియోగించిన తర్వాతే టీచర్లను పిలవాలి.. అనేవి సవరణ అంశాలు.

అయితే.. టీచర్లను ఎన్నికల విధులనుంచి తప్పించడానికే ఈ నిర్ణయం తీసుకున్నారనేది పచ్చమీడియా ఆరోపణగా ఉంది. టీచర్లలో జగన్ పట్ల వ్యతిరేకత ఉన్నదని, అందుకే వారిని తప్పించడానికి ఈ పనిచేశారని అంటున్నారు. అయితే వాస్తవంలో పరిస్థితి ఏంటంటే.. ఇలాంటి ఇతర చాకిరీ తగ్గించినందుకు హర్షాతిరేకాలతో టీచర్లలో ఇప్పుడు జగన్ క్రేజ్ మరింత పెరిగి ఉంటుందనడంలో సందేహం లేదు.

Show comments