ప్రగతి యాత్రతో దద్దరిల్లిన దెందులూరు

25 వేల మందితో జన సంద్రంగా మారిన దెందులూరు.

నాడు జనం కోసం జగన్ - నేడు జగన్ కోసం మనం అంటూ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి గారు ఇచ్చిన ఒక్క పిలుపుతో దెందులూరు నియోజకవర్గం నలుమూలల నుండి హాజరైన ప్రజలు, వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు.

రాష్ట్రంలో తొలిసారిగా జగనన్న సంక్షేమ పాలనకు నిదర్శనంగా జరిగిన పాదయాత్ర.

రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసిన ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారి దెందులూరు ప్రగతి యాత్ర.

దెందులూరు ప్రజలంతా జగనన్న మరియు అబ్బయ్య చౌదరి గారి వెంటే ఉన్నామని మరొకసారి నిరూపించిన దెందులూరు ప్రగతి యాత్ర కార్యక్రమం.

దెందులూరు ప్రగతి యాత్రతో ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన అబ్బయ్య చౌదరి గారు.

ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారి ఆహ్వానం మేరకు కార్యక్రమానికి హాజరైన ఉంగుటూరు ఎమ్మెల్యే శ్రీ పుప్పాల వాసుబాబు గారు, శాప్ చైర్మన్ శ్రీ బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి గారు మరియు ఇతర ప్రజా ప్రతినిధులు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారితో పాటు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన శాప్ చైర్మన్ శ్రీ బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి గారు. జానంపేట నుండి విజయరాయి వరకు భారీ జనసందోహం నడుమ ఉత్సాహంగా సాగిన దెందులూరు ప్రగతి యాత్ర. జయహో జగనన్న, జయహో అబ్బయ్య చౌదరి నినాదాలతో మార్మోగిన దెందులూరు పల్లెలు

భారీ జనసందోహాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారు మాట్లాడుతూ జనమంతా జగనన్న వెంటే ఉన్నారని, బై బై బాబు అంటూ మొన్నటి ఎన్నికల్లో 151 స్థానాలను అందించారని, ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో గుడ్ బై బాబు అంటూ 175 స్థానాలు గెలిపిస్తారని తెలిపారు.

మా జగనన్న కల్పించిన సంక్షేమం బాబు గారు ఎందుకు అందించలేకపోయారని? రైతులకు జగనన్న లాగా అండగా నిలిచే ఆలోచన ఎందుకు రాలేదని సూటిగా ప్రశ్నించారు. 30 లక్షల ఇళ్లు మా జగనన్న ఆడపడుచులకు అందిస్తున్నారని, 40 ఇయర్స్ ఇండస్ట్రీకి ఆ మంచి ఆలోచన ఎందుకు రాలేదని, చిన్నపిల్లల చదివే 45,000 బడులను సీఎం గారు నాడు-నేడు ద్వారా అభివృద్ధి చేస్తున్నారని, ఆ పని బాబు గారు ఎందుకు చేయలేదన్న దానికి జవాబు చెప్పాలని ఎమ్మెల్యే గారు డిమాండ్ చేశారు.

ఒక పక్కన 1.76 లక్షల కోట్లతో జగనన్న, సంక్షేమ రాజ్యం సృష్టిస్తూ ఉన్నా, 1700 కోట్లతో దెందులూరు అభివృద్ధి చేస్తున్నా కూడా రేపిక్కడికి రాబోతున్న బాబు గారిని "మాకి ఖర్మ ఏంటి ?" అని ఎమ్మెల్యే గారు ప్రశ్నించారు.జగనన్న ఆశయ సాధనే మా లక్ష్యమని, వారి బాటలో నడుస్తూ ప్రజలకు సేవ చేస్తామని, గత పాలకుల పాలనలో అభివృద్ధికి నోచుకోని దెందులూరు ను అబ్బయ్య చౌదరి గారు ప్రగతి పథంలో నడిపిస్తున్నారని కొనియాడిన ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు గారు.

బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా, అందరికీ సంక్షేమ పాలనను అందిస్తూ ప్రజల గుండెల్లో జగనన్న చెరగని ముద్ర వేస్తున్నాడని, అలాగే అబ్బయ్య చౌదరి గారి లాంటి ఎమ్మెల్యే ఉండటం దెందులూరు ప్రజల అదృష్టం అని తెలిపారు. చంద్రబాబును ప్రజలు నమ్మే స్థితిలో లేరని, ఇవే ఆయనకు చివరి ఎన్నికలని ఎద్దేవా చేశారు.

ఈ కార్యక్రమంలో దెందులూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల జెడ్పీటీసీ లు, ఎంపీపీ లు, వైస్ ఎంపీపీ లు, సొసైటీ అధ్యక్షులు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, ఇతర ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Show comments