హీరోయిన్ల‌లో కెళ్లా ఫిట్ ఈ అందాల భామే!

సినిమాల్లో ఊరికే న‌టించేస్తామంటే కాదు, హీరోయిన్లు కూడా క‌స‌ర‌త్తులు చేయాల్సిందే, ఫిట్ నెస్ ను చూపించుకోవాల్సిందే! అలాగ‌ని వీళ్లు యాక్ష‌న్ సినిమాల్లో ఇర‌గ‌దీసేస్తార‌ని కాదు, హీరోయిన్లు కూడా జిమ్ ల‌లో త‌మ స‌త్తా చూపించ‌డం మాత్రం త‌ప్ప‌నిస‌రి. బాలీవుడ్, టాలీవుడ్ ఇలా తేడా లేకుండా.. అన్ని చోట్లా హీరోయిన్లు జిమ్ ల‌లో చెమ‌ట‌లు చిందిస్తూ ఉంటారు. 

ర‌క‌ర‌కాల క‌స‌ర‌త్తులు చేస్తూ త‌మ సోష‌ల్ మీడియా ఖాతాల్లో ఫొటోలు పెడుతూ ఉంటారు. త‌ద్వారా త‌మ ఫిట్ నెస్ ను చాటుకుంటూ ఉంటారు. ఇదంతా ఒక ర‌కంగా త‌ప్ప‌నిస‌రి ఇప్పుడు. మ‌రి ఇలాంటి వారిలో కూడా అత్యంత ఫిట్ గా క‌నిపిస్తూ పోటీ పెడితే .. ముందు నిలిచేలా ఉంది బాలీవుడ్ న‌టి దిశా పాట్నీ. 

ఇన్ స్టాగ్ర‌మ్ లో త‌ర‌చూ ఫొటోలు పెడుతూ త‌న ఫాలోయ‌ర్ల‌ను అల‌రించే దిశ కేవ‌లం త‌న గ్లామ‌ర్ నే కాదు, త‌న ఫిట్ నెస్ ను కూడా చాటుతూ ఉంద‌క్క‌డ‌! కేవ‌లం జిమ్ లో బ‌రువులు ఎత్త‌డం, రాతి కండ‌ల‌ను ప్ర‌ద‌ర్శించ‌డ‌మో కాదు.. ఎగిరి కిక్ లు ఇస్తోంది! ఒక కిక్ బాక్స‌ర్ లెవ‌ల్ ఫిట్ నెస్ ను చూపిస్తోంది దిశ‌.

ఈమె హై లెగ్ కిక్స్ ను చూస్తే .. వ్వావ్.. అనాల్సిందే! ఆ రేంజ్ ఫిట్ నెస్ తో ఉంది దిశ‌. ఎగిరి మ‌రీ త‌న లెగ్స్ తో బ్యాగ్ ను తంతోంది. సాధార‌ణంగా సినిమా హీరోలు కూడా ఈ త‌ర‌హా ఫీట్ల‌ను చేయ‌లేరు. అలాంటిది దిశ మాత్రం అద్భుత‌మైన ఫిట్ నెస్ ను చూపిస్తోంది. మ‌రి ఈమె ఫీట్ల‌ను చూస్తే.. ఏ కిల్ బిల్ త‌ర‌హా సినిమానో చేయ‌డానికి కావాల్సినంత స‌త్తా త‌న‌లో ఉంద‌ని నిరూపించుకుంటున్న‌ట్టుగా ఉంది. మ‌రి అలాంటి దిశ‌ను ముందు పెట్టి అలాంటి యాక్ష‌న్ మ‌సాలాను ఏ బాలీవుడ్ ద‌ర్శ‌కుడో రూపొందిస్తాడేమో!

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by disha patani (paatni)

Show comments