ఎక్స్ క్లూజివ్..త్రివిక్రమ్…ఫస్ట్ టైమ్

దర్శకుడు త్రివిక్రమ్ సినిమాలకు ఓ స్టయిల్ అంటూ వుంది. యాక్షన్..ఫ్యామిలీ..ఎంటర్ టైన్ మెంట్ అంటూ ఏ తరహా సినిమాలు తీసినా, ఆయనకు అంటూ ఓ పద్దతి వుంది. ఇప్పటి వరకు త్రివిక్రమ్ చేయని పని ఒకటి వుంది. తన సినిమాల్లో ప్రత్యేక గీతాలు అంటూ పెట్టకపోవడం.

అత్తారింటికి దారేది సినిమాలో పబ్ గీతం వున్నా, అది కూడా భలే పద్దతిగా వుంటుంది. ముఖ్యంగా ఐటమ్ సాంగ్ అన్నది ఇప్పటి వరకు త్రివిక్రమ్ ఆలోచించని విషయం.

ఇప్పుడు తొలిసారి ఐటమ్ సాంగ్ అనే దాని మీద త్రివిక్రమ్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మహేష్ బాబుతో చాలా కాలం తరువాత త్రివిక్రమ్ సినిమా చేస్తున్నారు.

మహేష్ తో ఆయనకు మూడో సినిమా. అలాగే హారిక హాసిని సంస్థకు మహేష్ బాబుతో తొలిసినిమా. అందుకే చాలా ప్రెస్టీజియస్ గా ఫీల్ అవుతున్నారు. ఈ సినిమాకు అన్ని విధాలా వీలయినంత స్పెషల్ వుండాలని చూస్తున్నారు.

ఇలాంటి నేపథ్యంలోనే త్రివిక్రమ్ తొలిసారి తన సినిమాలో ఐటమ్ సాంగ్ పెట్టాలని ఆలోచిస్తున్నారు. దీనికి చాలా మంది పాపులర్ హీరోయిన్ల పేర్లు పరిశీలిస్తున్నారని బోగట్టా.

తివిక్రమ్ పాటల చాలా బాగా చేయించుకుంటారు. ధమన్ కూడా త్రివిక్రమ్ అంటే అలాగే పాటలు ఇస్తారు. ఇక ఆ ఇద్దరి కాంబినేషన్ లో ఐటమ్ సాంగ్ అంటే ఓ రేంజ్ లో వుంటుంది. దానికి ఏ ఫిమేల్ స్టార్ స్టెప్ లు యాడ్ అవుతాయో చూడాలి మరి.

Show comments