ఫ్లాప్ వచ్చె మొదలాడు!

హీతో నితిన్ రెడ్డి ఇప్పుడు డైలామాలో వున్నారు. పూర్తి ప్రూల్ ప్రూఫ్ సబ్జెక్ట్ తయారయ్యే వరకు సినిమా షూట్ కు దూరంగా వుంటున్నారు. గతంలో ఓకె చేసిన వక్కంతం వంశీ సినిమా మరో రెండు నెలలు ఆలస్యం కాబోతోంది. నవంబర్ లో కానీ ఈ సినిమా సెట్ మీదకు వెళ్లే అవకాశం కనిపించడం లేదు. 

దాదాపు రెండేళ్లుగా ఈ స్క్రిప్ట్ ను వక్కంతం వంశీ చెక్కిస్తున్నారు. చెక్కించడం అంటే ఆయన స్వంతగా స్క్రిప్ట్ చెక్కడం కాదు, రకరకాల రైటర్లను తీసుకుని, టీమ్ లు టీమ్ లుగా పెట్టి పోషిస్తూ, స్క్రిప్ట్ తయారు చేసే పనిలో వున్నారు. కానీ ఆ పని కూడా సంతృప్తిగా రావడం లేదేమో, దాదాపు నెల రోజులుగా హీరో నితిన్ ఖాళీగా వుండిపోయారు. అక్టోబర్, నవంబర్ కూడా ఇలా ఖాళీగా వుండే అవకాశం వుందని తెలుస్తోంది.

స్క్రిప్ట్ పని టీమ్ కు అప్ప చెప్పి, వక్కంతం ప్రీ ప్రొడక్షన్ పనుల మీద బిజీగా వున్నారు. ఈ సినిమా కాక సాగర్ స్క్రిప్ట కు కూడా నితిన్ ఓకె చెప్పారు. సురేందర్ రెడ్డి సినిమా ఒకటి చేయాల్సి వుంది. ఎప్పుడయితే మాచర్ల నియోజకవర్గం దారుణంగా ఫ్లాప్ అయిందో, నితిన్ స్క్రిప్ట్ విషయంలో కీలకంగా వున్నట్లు తెలుస్తోంది.

మళ్లీ మాస్ సినిమానే చేస్తారా? లేక నితిన్ కు హిట్ లు ఇచ్చిన లవ్ ..రోమ్ కామ్ సినిమాలు చేస్తారా? నితిన్ కే కాదు చాలా మంది హీరోలకు మాస్ సినిమాలు ఇష్టం. అవి దారుణంగా ఫ్లాప్ అయినా వాటి వెంటే పరుగెడుతుంటారు. మరి నితిన్ ఈ సారి ఏం చేస్తారో చూడాలి? మాచర్ల ఫ్లాప్ రాకుండా వుండి వుంటే వక్కంతం వంశీ సినిమా ఈ పాటికి సెట్ మీద వుండేది. ఫ్లాప్ కావడంతో మొత్తం స్క్రిప్ట్ తిరగదోడుతున్నట్లు బోగట్టా.

Show comments