బింబిసార అమ్మడితో మెగాస్టార్

లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్. తెలుగు ప్రేక్షకుల అభిరుచి మేరకు, మెగా ఫ్యాన్స్ కోసం తగిన మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగా లేటెస్ట్ గా ఓ ఐటమ్ సాంగ్ ను కూడా యాడ్ చేసారని తెలుస్తోంది. 

సల్మాన్-మెగాస్టార్ ల పాట చిత్రీకరించారు కానీ అది సినిమాలో సెట్ కాక రోలింగ్ టైటిల్స్ మీదకు మార్చేసారు. అందుకోసం ఐటమ్ సాంగ్ అనే ప్రత్యేక గీతాన్ని అప్పటికప్పుడు ప్లాన్ చేసి చిత్రీకరించినట్లు తెలుస్తోంది.

మరి స్పెషల్ సాంగ్ అన్నాక, స్పెషల్ హీరోయిన్ ఎవరైనా వుండాలి. ఇటీవల బింబిసార సినిమాలో…’బింబిసారా’ అంటూ బింబిసారుడిని కవ్విస్తూ ఆడిపాడిన వారినా హుస్సేన్ మీద నిర్మాతల దృష్టి పడింది. ఆ మేరకు ఆమెను రప్పించి షూట్ చేసేసారు.

కేవలం ఈ ప్రత్యేక గీతానికే కోటిన్నర ఖర్చయినట్లు తెలుస్తోంది. మెగాస్టార్…సల్మాన్ ఖాన్..నయనతార..సత్యదేవ్ తదితర తారాగణ వున్న లూసిఫర్ సినిమా అక్టోబర్ 5న విడుదలకు రెడీ అవుతోంది. 28న అనంతపురంలో ప్రీ రిలీజ్ ఫంక్షన్..ట్రయిలర్ విడుదల వుంటాయి. ఈ సినిమాను ఎన్వీ ప్రసాద్..ఆర్బీ చౌదరి..రామ్ చరణ్ కలిసి నిర్మించారు.

Show comments