అమరూ…బాగా ఓవరూ...!

అదేదో సినిమాలో కోటా శ్రీనివాసరావు పొలిటికల్ లీడర్..కూడా ఫొటోగ్రాఫర్ వుంటాడు. భంగిమ..భంగిమ అంటూ ఫొటోలు తీస్తూనే వుంటాడు. ఇప్పుడు రాజ‌కీయ నాయకులు కూడా అలాగే తయారయ్యారు. 

ట్విట్టర్, ఫేస్ బుక్ ల కోసం కూడా ఓ ఫొటొగ్రాఫర్ ను వుంచుకుంటున్నారు. అది కొంత వరకు ఒకె కానీ ఆంధ్ర కొత్త మంత్రి గుడివాడ అమర్ నాధ్ మరో అడుగు ముందుకు వేసి ఏకంగా ఫొటొో షూట్ చేయించేసారు. ఎమ్మెల్యేగా వుండగానే అమర్ హడావుడి మామూలుగా వుండేది కాదు. ముందు వెనుక మూడు కార్లు, అవి కూడా అన్నీ బ్లాక్ కార్లు. కాన్వాయ్ అంత హడావుడి వుండేది. మంత్రి అయ్యాక మరి చెప్పక్కరలేదు.

లేటెస్ట్ గా ఓ ఫొటో షూట్ చేయించుకున్నారు. చేయించుకంటే చేయించుకున్నారు అదేమైనా రెగ్యులర్ పొలిటిికల్ ఫార్మాట్ నా అంటే అదీ కాదు. కారులో నిల్చుని, కారు ఎక్కుతూ, మాంచి కళ్లఙోడు పెట్టుకుని, సినిమా హీరోల స్టయిల్ లో ఫొటో షూట్ చేయించుకున్నారు. పోనీ చేయించుకుంటే చేయించుకోవాలని అనిపించి వుండొచ్చు. కానీ ఫొటో షూట్ వర్కింగ్ స్టిల్స్ బయటకు రాకుండా చూసుకోవాలి కదా. అవి కాస్తా తెేలుగుదేశం పార్టీకి దొరికాయి.

ఇక చాలు వాళ్లు సోషల్ మీడియాలో వేసుకోవడం మొదలెట్టారు. సినిమాల్లో ట్రయ్ చేయాలనా? అందుకే గతంలో పవన్ తో కలిసి ఫొటో తీయించుకున్నావా? ఇలా రకరకాలుగా. ఆ భారీ ఫొటొ షూట్ వర్కింగ్ స్టిల్స్ చూసి జ‌నం నవ్వుకుంటున్నారన్నది గుడివాడ వరకు వచ్చిందో లేదో మరి? ప్రస్తుతం మంత్రుల్లో జ‌గన్ అభిమానం సంపాదించినది గుడివాడనే. మళ్లీ టికెట్ గ్యారంటీ కూడా వుంది. 

అందువల్ల ఇలాంటి టైమ్ లో ఇలాంటి ఫొటో షూట్ లు చేసి అభాసు కావడం అవసరమా? అసలే ఈసారి ఆయన నియోజ‌క వర్గంలో గట్టి పోటీ తప్పేలా లేదు. వైకాపాలోకి వచ్చి ఎదుగదలకు నోచుకోని దాడి వర్గం పూర్తి అసంతృప్తిగా వుంది. అవకాశం దొరికితే జ‌నసేనకు జంప్ అంటుంది అని ఓ టాక్. లేదు తెలుగుదేశం లోకే మళ్లీ వెళ్తుంది అని మరో టాక్. ఈలోగా నియోఙకవర్గంలోని కులాల సమీకరణలు కూడా గట్టిగా వున్నాయి.

ఇలాంటి టైమ్ లో గుడివాడ ఇలాంటి ఫొటో షూట్ ల కన్నా, జ‌నాలకు దగ్గరగా వుండే పనులు ఏవైనా చేయడం బెటరేమో?

Show comments