నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్‌!

తెలంగాణ‌లో బీజేపీ నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్ అయ్యింది. ఇప్ప‌టికే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డిని త‌మ వైపు తిప్పుకోవ‌డంలో బీజేపీ స‌క్సెస్ అయ్యింది. ఇక త‌రువాత వంతు రాజ‌గోపాల్‌రెడ్డి అన్న, ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌టరెడ్డే. ఆయ‌నపై తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పొగ‌డ్త‌లు చూస్తే...ఆ పార్టీ గురి ఎవ‌రిపైనే సులువుగా అర్థం చేసుకోవ‌చ్చు.

బండి సంజ‌య్ మీడియాతో మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి త‌మ‌తో ట‌చ్‌లో ఉన్నార‌ని చెప్ప‌లేద‌న్నారు. కోమ‌టిరెడ్డి మంచి లీడ‌ర్ అని సంజ‌య్ ప్ర‌శంస‌లు కురిపించారు. ఈ రెండు మాట‌లు చాల‌వా... కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డిని బీజేపీలో చేర్చుకోడానికి పావులు క‌దుపుతున్నార‌ని అర్థం చేసుకోడానికి. బీజేపీలోకి వెంక‌ట‌రెడ్డి వెళ్ల‌డం పెద్ద‌గా ఆశ్చ‌ర్యం క‌లిగించ‌దు.

ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఆయ‌న చాలా అస‌హ‌నంగా, ఆగ్ర‌హంగా ఉన్నారు. గ‌త వారం రోజులుగా కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి మీడియాతో మాట్లాడిన అంశాల‌ను ప‌రిశీలిస్తే... కాంగ్రెస్ పార్టీ త‌న‌ను వెళ్ల‌గొట్టాల‌ని కోరుకుంటున్న‌ట్టుగా ఉంది. దీన్ని తెలంగాణ బీజేపీ రాజ‌కీయంగా క్యాష్ చేసుకునే ప్ర‌య‌త్నంలో వుంది.అందుకే వెంక‌ట‌రెడ్డిపై బండి సంజయ్ ప్ర‌త్యేక అభిమానం ప్ర‌ద‌ర్శించ‌డం.

మీడియాతో బండి సంజ‌య్ మాట్లాడుతూ బీజేపీ ప్ర‌భుత్వం ఈడీని వాడుకోవాల‌ని చూస్తే తెలంగాణలో ఏ ఒక్క మంత్రి, ఎమ్మెల్యే కూడా మిగ‌ల‌డ‌ని సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. కేసీఆర్‌ బొమ్మను చూసి ఓట్లు వేసే రోజులు పోయాయ‌న్నారు. 

Show comments