కిషన్ రెడ్డి ఎవరి శిష్యుడు?

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీద పడింది ఎల్లో మీడియా ఇప్పుడు. రాజకీయాల్లో వున్న ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు గురుతుల్యులు వుంటారు. ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయానా ఏదో ఒక గురువు పేరు చలామణీలో వుంటూనే వుంటుంది. 

భాజపాలో కిషన్ రెడ్డి కి వెంకయ్యనాయుడి మనిషిగా, ఆయన శిష్యుడిగా గుర్తింపు వుంది. కిషన్ అందరి మనిషి కావచ్చు. అది వేరే సంగతి. ప్రచారంలో వున్న విషయం అయితే అది. వెంకయ్యకే కాదు. వెంకయ్య అంటే ఆదరాభిమానాలు అపరిమితంగా కనబర్చే మీడియాకు కూడా కిషన్ రెడ్డి అంటే అభిమానం అని రాజకీయ వర్గాల్లో టాక్ వుంది

అలాంటిది ఈరోజు భీమవరంలో జరిగిన అల్లూరి విగ్రహ ఆవిష్కరణ సభ విషయంలో ఎంపీ రఘురామకృష్ణం రాజుకు ఆహ్వానం అందకపోవడం వెనుక కిషన్ రెడ్డినే వున్నట్లుగా ప్రచారం ప్రారంభించేసారు. కిషన్ రెడ్డి…జగన్ రెడ్డి..రోజా రెడ్డి అంటూ కులాల ఈక్వేషన్లు తీయడం ప్రారంభించారు. 

గతంలో చంద్రబాబు అనేక సార్లు జగన్ ను పలు అధికారిక సమావేశాలకు ఆహ్వానించని సందర్భాలు వున్నాయి. అప్పుడు జగన్ ప్రతిపక్షనేత. అయినా డెలిబిరేట్ గా పిలవడం మానేసిన సందర్భాలు వున్నాయి. అప్పుడు ఈ గొంతులు ఏవీ లేవలేదు. తప్పు అన్న మాటే అనలేదు.

కానీ ఇప్పడు ఒక్కసారిగా కిషన్ రెడ్డి కాస్తా రెడ్డి గా కనిపిస్తున్నాడు. జగన్ తో లింక్ అంటిస్తున్నారు. ఇది కిషన్ రెడ్డి స్వంత ప్రోగ్రామ్ కాదు అంటూ జగన్ ను మోడీ దత్తపుత్రుడు అంటూ రాజకీయ నాయకుల మాదిరిగా విమర్శలు చేయడం ప్రారంభించారు. 

జనసేన, కాంగ్రెస్ కు ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తారు. పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేని కాంగ్రెస్ ను ఎలా పిలుస్తారు. జనసేన ఎమ్మెల్యేగా రాపాకకు ఆహ్వానం దక్కింది కదా?

గమ్మత్తేమిటంటే ఇటు తేదేపా కానీ అటు జనసేన కానీ ఈ విషయాల మీద గొంతు విప్పడమే లేదు. మోడీ గుడ్ లుక్స్ లో వుండాలనే చూస్తున్నాయి. వాటి తరపున ఈ మీడియాలు మాత్రం గొంతు విప్పుతున్నాయి.

Show comments