బింబిసార…భారీ ట్రయిలర్

నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా వచ్చి చాలా కాలం అయింది. కొత్త దర్శకుడు వాశిష్ట మల్లిడి తో సినిమా స్టార్ట్ చేసి కూడా చాలా కాలం అయింది. ఓ కొత్త దర్శకుడికి అవకాశం ఇవ్వడమే కాదు. ఆ దర్శకుడిని అతగాడి కథను నమ్మి భారీగా పెట్టుబడి పెట్టడం కాస్త ఆశ్చర్యమే కలిగించింది. 

అయితే బింబిసార ట్రయిలర్ ఆ ఆశ్చర్యాలు అన్నింటినీ పటాపంచలు చేసింది. రెండున్నర నిమషాలకు పైగా సాగిన ఈ ట్రయిలర్ చాలా భారీగా వుంది.

పునర్జన్మల కాన్సెప్ట్ తో తయారైంది బింబిసార సినిమా. అటు బింబిసారుడు..ఇటు ఈ తరం హీరో కు లింక్ పెట్టి కథ అల్లుకున్నట్లు వుంది. మధ్యలో నిధి, ప్రపంచంపై ఆధిపత్యం సాధించడం లాంటివి అన్నీ మిక్స్ చేసినట్లున్నారు. కథ విషయం అలా వుంచితే మేకింగ్, విజువల్స్ అన్నీ టాప్ లెవెల్ లో వున్నాయి.

కళ్యాణ్ రామ్ డబుల్ రోల్ చేసాడు. రెండిటిలో బాగా కనిపించాడు. బలమైన బేస్ వాయిస్ డైలాగులు చాలానే వున్నాయి. కీరవాణి నేపథ్య సంగీతం కూడా అందుకు తగినట్లే సాగింది. సినిమాటోగ్రఫీ, సెట్ లు, గెటప్ లు ఇలా ఒకటేమిటి? ట్రయిలర్ అంతా భారీ భారీగా సాగింది. ఆగస్టు 5న ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. 

Show comments