చెప్పుతో కొట్ట‌బోయిన న‌రేశ్ భార్య‌

టాలీవుడ్ న‌టుడు న‌రేశ్ వివాహ జీవితంలో త‌లెత్తిన వివాదం రోజురోజుకూ ముదురుతోంది. న‌రేశ్ మూడో భార్య ర‌మ్య‌ ఇవాళ తీవ్ర ఆగ్ర‌హాన్ని ప్ర‌ద‌ర్శించారు. త‌న‌కు విడాకులు ఇవ్వ‌కుండానే న‌రేశ్ మ‌రో న‌టి ప‌విత్ర లోకేశ్‌తో కాపురం పెట్టార‌ని ర‌మ్య‌ మండిప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఆమె గ‌త కొంత కాలంగా మీడియా వేదిక‌గా న‌రేశ్‌-ప‌విత్ర మ‌ధ్య సాగుతున్న బాగోతంపై నిప్పులు చెరుగుతున్నారు.

ఇందులో భాగంగా మైసూర్‌కు వెళ్లిన ర‌మ్య చేతికి ప‌ని చెప్పడం తీవ్ర క‌ల‌క‌లం సృష్టించింది. మైసూర్‌లో ఓ హోట‌ల్‌లో న‌రేశ్‌- ప‌విత్ర ఉన్నార‌న్న విష‌యం తెలిసి ర‌మ్య అక్క‌డికి వెళ్లారు. త‌న‌కు విడాకులు ఇవ్వ‌కుండా మ‌రో మ‌హిళ‌తో ఎలా కాపురం చేస్తావ‌ని న‌రేశ్‌ను గ‌ట్టిగా నిల‌దీశారామె. ఈ సంద‌ర్భంగా ప‌విత్ర‌తో ర‌మ్య వాగ్వాదానికి దిగారు. ఇద్ద‌రి మ‌ధ్య మాట‌లు అదుపు దాటాయి.

ఈ నేప‌థ్యంలో ప‌విత్ర‌ను చెప్పుతో కొట్టేందుకు ర‌మ్య ప్ర‌య‌త్నించింది. ర‌మ్య‌ను చుట్టుప‌క్క‌ల వారు అడ్డుకున్నారు. గొడ‌వ విష‌య‌మై స‌మాచారం అందుకున్న పోలీసులు అక్క‌డికి చేరుకున్నారు. అస‌లే తీవ్ర కోపంగా ఉన్న ర‌మ్య ఏం చేస్తారో అనే భ‌యం న‌రేశ్ -ప‌విత్ర‌ల‌ను క‌ల‌వ‌ర‌ప‌రిచింది. అక్క‌డే వుంటే అవ‌మానం త‌ప్పిద‌ని గ్ర‌హించారు. దీంతో గుట్టుచ‌ప్పుడు కాకుండా అక్క‌డి నుంచి న‌రేశ్ - ప‌విత్ర అక్క‌డి నుంచి జారుకున్నారు. 

ఇదిలా వుండ‌గా ఇటీవ‌ల న‌రేశ్ మీడియాతో మాట్లాడుతూ తన మూడో భార్య ర‌మ్య‌కు మ‌రో వ్య‌క్తితో వివాహేత‌ర సంబంధం ఉంద‌ని ఆరోపించారు.

దీన్ని ర‌మ్య జీర్ణించుకోలేకే దాడికి వెళ్లిన‌ట్టు ఆమె స‌న్నిహితులు చెబుతున్నారు. ఏది ఏమైనా న‌రేశ్ వైవాహిక జీవితంలో త‌లెత్తిన వివాదం ముదిరి పాకాన ప‌డుతోంద‌నేందుకు ఇవాళ మైసూర్‌లో చోటు చేసుకున్న ఉద్రిక్త వాతావ‌ర‌ణ‌మే నిద‌ర్శ‌నం అని చెప్పొచ్చు.

Show comments