ఆ హీరోకే దిక్కులేదు.. అతడి తమ్ముడు కూడా!

టాలీవుడ్ లో అతడో చిన్న హీరో. కాకపోతే తొలి సినిమాతో పెద్ద హిట్ అందుకున్నాడు. ఇప్పటికీ అతడి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అదే. ఆ తర్వాత వరుసపెట్టి ఫ్లాపులిచ్చాడు, ఇంకా ఇస్తూనే ఉన్నాడు. ఇలాంటి పొజిషన్ లో తను ఉండగా, అది చాలదన్నట్టు ఇప్పుడు తన తమ్ముడ్ని కూడా ఇండస్ట్రీకి తీసుకొస్తున్నాడు.

ఆ హీరోకే ఇప్పుడు అవకాశాలు అంతంతమాత్రంగా వస్తున్నాయి. తాజాగా చేసిన సినిమాలతో అతడి క్రేజ్ కూడా తగ్గిపోయింది. ఇలాంటి టైమ్ లో వరసకు తమ్ముడైన ఓ వ్యక్తిని హీరోగా చేయాలనే అతడి ప్రయత్నాల్ని చూసి సినీజనం ముక్కున వేలేసుకుంటున్నారు.

సదరు హీరో తమ్ముడు ఆల్రెడీ హీరో అయిపోయాడు. రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఓ సస్పెన్స్ థ్రిల్లర్ చేశాడు. రేపోమాపో ఆ సినిమా వివరాలు బయటకు రాబోతున్నాయి. తమ్ముడి డెబ్యూ కోసం ఆ సినిమాకు, ఈ ఫ్లాప్ హీరో ప్రచారం చేస్తాడట.

మనోడు ముందు నుంచే సౌండ్ పార్టీ. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఓ మోస్తరుగా సంపాదించుకున్నాడు. దీంతో తమ్ముడి డెబ్యూ కోసం 70-80 లక్షలు ఈజీగానే కేటాయించగలిగాడు. కానీ డబ్బులు సమకూరిస్తే సరిపోదు కదా. డెబ్యూ కోసం మరింత సెటప్ అవసరం. అలా సెట్ చేయడంలో సదరు హీరో ఫెయిల్ అయ్యాడు. ఓ కొత్త దర్శకుడితో తన కజిన్ బ్రదర్ ను టాలీవుడ్ కు పరిచయం చేయబోతున్నాడు.

నిజంగా అంత సెట్ చేసేంత టాలెంట్ ఉంటే తనే ఓ మంచి ప్రాజెక్టు చేసేవాడు. కానీ ఇతగాడికి యాక్టింగ్ టాలెంట్ ఉన్నప్పటికీ, మేనేజర్ చేస్తున్న పనుల వల్ల ఈ హీరో ఇబ్బందులు పడుతున్నాడు. ఇలా కిందామీద పడుతున్న దశలో, తమ్ముడి బాధ్యతలు కూడా భుజానికెత్తుకొని మరిన్ని తలనొప్పులు తెచ్చుకుంటున్నాడు.

Show comments