రామ్...రానన్నాడా?

హీరో రామ్....యంగ్ హీరో అనిపించుకున్నాడు కానీ మాస్ హీరోగా ఓ స్టేటస్ ను తెచ్చుకున్నది మాత్రం ఇస్మార్ట్ శంకర్ సినిమా తోనే పూరి అతగాడికి ఓ బ్లాక్ బస్టర్ ఇచ్చి, ఇదీ నీ ఇమేజ్..ఇదీ నీ రేంజ్ అని తెలియచెప్పాడు. కానీ టాలీవుడ్ లో అవసరాలు, అవకాశాలే తప్ప ఆదుకోవడాలు వుండవు. 

పూరి కొడుకు ఆకాష్ పూరి చోర్ బజార్ అనే ఓ సినిమా చేసి, దానికి కాస్త ప్రమోషన్ సాయం చేయమంటే అదే రామ్ నో అన్నాడని గ్యాసిప్ వినిపిస్తోంది. పూరి తొ రెండు సినిమాలు చేసిన ప్రభాస్ గతంలో తనే స్వయంగా ఆకాష్ పూరితో వీడియో ఇంట్రాక్షన్ ద్వారా ప్రమోట్ చేసాడు.  

ప్రభాస్ రేంజ్ హీరో అలా దిగి వచ్చి ప్రమోట్ చేసాడు అంటే అది కేవలం పూరితో వున్న అనుబంధం. చోర్ బజార్ సినిమా కోసం కూడా అదే ప్రభాస్ యువి అధినేతలు, తన స్నేహితులతో మాట్లాడి చేయగలిగింది చేసాడు.  

కానీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు రమ్మనమని ఎంత మంది హీరోలను ఆకాష్ పూరి రిక్వెస్ట్ చేసినా, దాదాపు అందరూ ఏదో రీజన్ చెప్పి తప్పించుకున్నారని టాలీవుడ్ లో వినిపిస్తోంది. అదే నిజమైతే అంతకన్నా దారుణం మరోటి లేదు. 

Show comments