మందేస్తూ..చిందేసిన యాంకర్!

టాలీవుడ్ అన్నాక పార్టీలకు కొదవలేదు...పార్టీలు అన్నాక మందుకు తక్కువ లేదు...మందు లోపల పడ్డాక చిందులకు లోటుండదు. ఇటీవల జరిగిన ఓ బర్త్ డే పార్టీలో ఓ అమ్మడు ఇలాగే చిందేసినట్లు గ్యాసిప్ లు ఇండస్ట్రీ అంతా బలంగా పాకేసాయి. 

ఇంతకీ బర్త్ డే పార్టీ టాలీవుడ్ సెలబ్రిటీ కాదు. టాలీవుడ్ తో సంబంధాలు మెయింటెయిన్ చేస్తూ, తన బ్రాండింగ్ తో వారిని దగ్గరకు చేర్చుకుంటూ, సోషల్ మీడియాలో సెలబ్రిటీ స్టేటస్ ను సంపాదించుకున్న ఓ బిజినెస్ మన్ ది. 

ఈ బిజినెస్ మన్ క్లోజ్డ్ పార్టీలకు, పేకాటలకు కూడా సదరు యాంకర్ పర్మనెంట్ గెస్ట్ అని వార్తలు వున్నాయి. అయితే వ్యవహారం అంతా పెగ్గులు..హగ్గుల వరకే తప్ప అంతకు మించి హద్దులు దాటదు. ఆ డిసిప్లిన్ ఆవిడ సొంతం.

అయితే ఇంతకీ విషయం ఏమిటంటే బర్త్ డే పార్టీకి వచ్చిన ఆమె ఒకటి రెండు పెగ్గులేసిన తరువాత కాస్త హల్ చల్ చేసిందని, అదుపుతప్పి అటు ఇటు ఊగడంతో అక్కడ వున్నవారు సాయం పట్టారని గ్యాసిప్ బలంగా వినిపిస్తోంది. 

గ్యాసిప్ లో వాస్తవ మెంతో అన్నది పక్కన పెడితే ఆ సెలబ్రిటీ క్లోజ్డ్ గ్రూప్ లో ఈ యాంకర్ ఒకరు అన్నది అందరికీ తెలిసిన విషయమే కనుక, ఇదీ కరెక్టే అని బలంగా నమ్ముతున్నారు. తెలుసున్నవారికి షేర్ చేసుకుంటున్నారు.

Show comments