షికారు…హోల్ సేల్

విశాఖ ప్రాంతంలో సీనియర్ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ సాయిలక్ష్మీ బాబ్జీ నిర్మించిన సినిమా షికారు. ఈ సినిమా 24న విడుదలవుతోంది. 

కొత్త, పాత కలయికలో చిన్న సినిమాగా నిర్మించిన ఈ సినిమా థియేటర్ హక్కులను ఇప్పుడు హోల్ సేల్ గా అమ్మేసారు. డిస్ట్రిబ్యూటర్ సురేష్ ఈ సినిమా టోటల్ హక్కులు తీసుకున్నారు.

హరి కొలగాని దర్శకత్వంలో సాయి దన్సిక ప్రధాన పాత్రలో తేజ్ కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, ధీరజ్ ఆత్రేయ, నవకాంత్ హీరోలుగా నటించిన ఈ చిత్రంలో కన్నడ కిషోర్, చమ్మక్ చంద్ర, రచ్చరవి, పోసాని, అన్నపూర్ణమ్మ, సురేఖ వాణి, సత్య శ్రీ, గాయత్రి రెడ్డి(బిగిల్ ఫేం)తదితరులు నటించారు.

పూర్తిగా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ సబ్జెక్ట్ తో, ఫన్ బేస్డ్ గా ఈ సినిమాను రూపొందించారు. ఇప్పటి వరకు విడుదల చేసిన కంటెంట్ కు మంచి ఆదరణ దక్కింది. దీంతో హోల్ సేల్ గా అమ్ముడైంది. ఓ చిన్న సినిమా ఇలా హొల్ సేల్ గా అమ్ముడు కావడం నిర్మాతకు ఆనందకరమే.

Show comments