పాతికేళ్ల ప్రస్థానం.. బాబు నోట పవన్ మాట

చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు ఒకే పార్టీ కాదు. పైకి సెపరేటు అని చెప్పుకుంటున్నప్పటికీ ఇద్దరి మధ్య చెప్పలేనంత ప్రేమ ఉంది. ఆ ప్రేమతో పవన్ కల్యాణ్ డైలాగ్ ను చంద్రబాబు రిపీట్ చేశారు. పాతికేళ్ల రాజకీయం అనే పదప్రయోగాన్ని వాడారు. టీడీపీ నేతలు పాతికేళ్ల పాటు అధికారంలో ఉండేలా కష్టపడాలంట. పవన్ కూడా ఎప్పుడూ ఇలానే చెబుతుండేవారు. 

తను తాత్కాలిక ప్రయోజనాల కోసం రాలేదని, పాతికేళ్ల రాజకీయ ప్రణాళికతో వచ్చానని అంటారు. ఆల్రెడీ పవన్ వచ్చి అటుఇటుగా పదేళ్లు అవుతోంది. బాబు 40 ఇయర్స్ అనిపించుకున్నారు. మళ్లీ ఇప్పుడు కొత్తగా ఈ పాతికేళ్ల రాజకీయం కాన్సెప్ట్ ఏంటో.. దత్తపుత్రుడు, దత్త తండ్రి కలిసి ఈసారి కొత్తగా ఏం స్కెచ్ రెడీ చేశారో..?

ఐదేళ్లు కాదు, పదేళ్లు కాదు పాతికేళ్లు జగనే సీఎం అంటూ వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారంతో చంద్రబాబులో కూడా భయం మొదలైంది. మూడేళ్ల పాలనతోనే జగన్, బాబు ఫార్టీ ఇయర్స్ ఎక్స్ పీరియన్స్ ని వెక్కిరించారు. చంద్రబాబు ఊహల్లోకి కూడా రాని పథకాలతో జనానికి దగ్గరయ్యారు. విజన్ 2020 అని గతంలో చెప్పుకునే చంద్రబాబుకి సరిగ్గా 2020లో అధికారం లేకుండా చేశారు జగన్.

అందుకే బాబు నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. ఈసారి పవన్ స్లోగన్ అందుకున్నారు. పాతికేళ్ల ప్రస్థానం సాగిస్తానంటున్నారు. ఎన్నికల వరకు చంద్రబాబు ఆరోగ్యం ఎలా ఉంటుందా అని పార్టీ శ్రేణులు ఆందోళన పడుతున్న వేళ.. పాతికేళ్ల ప్రస్థానం అంటూ ఆయన పిలుపునివ్వడం మాత్రం హాస్యాస్పదం.

కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారా..?

తామిద్దరం కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినట్టు పాతికేళ్ల ప్రస్థానం అంటూ చంద్రబాబు, పవన్ ప్రజలకి కబుర్లు చెబుతుంటారు. అంటే ఇప్పటి వరకు తాను చేసిన తప్పుల్ని మన్నించండి అంటూ చంద్రబాబు వేడుకుంటున్నట్టే అనుకోవాలా..? ఆయనలో అంత పశ్చాత్తాపం ఉంటుందని ఎవరూ అనుకోరు. 

ఇక పవన్ పిలుపుని మాత్రం జనం ఇప్పటివరకూ పట్టించుకోలేదనే చెప్పాలి. కానీ ఆయన ఎప్పుడు పాతికేళ్లకే ఫిక్స్ అయ్యారు. పార్టీ పెట్టి ఏళ్లు గడుస్తున్నా.. పాతికేళ్ల రాజకీయం కావాలంటారు పవన్. ఇప్పుడీ డైలాగుని వంటబట్టించుకున్న చంద్రబాబు 72 ఏళ్ల వయసులో ఫ్యూచర్ పాలిటిక్స్ గురించి చెప్పడం విడ్డూరం.

Show comments