పాడిందే పాడిన చంద్ర‌బాబు!

తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు జ‌నం మ‌ధ్య‌కు వెళ్తున్నారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా చంద్ర‌బాబు నాయుడు... త‌న ప్ర‌సంగాన్ని అంతా పాత‌ధోర‌ణిలోనే కొన‌సాగించారు. 

త‌న ఇంటిపై దాడి జ‌రిగింద‌ని, త‌న కుటుంబ స‌భ్యుల‌ను ఏపీ అసెంబ్లీలో అవ‌మానించారని, జ‌గ‌న్ మాయ‌లో జ‌నం ప‌డ్డార‌ని, అందుకే అన్ని సీట్ల‌ను క‌ట్ట‌బెట్టార‌ని, త‌ను ప‌ద్నాలుగేళ్లుగా సీఎంగా అద్భుతంగా పాలించిన‌ట్టుగా, త‌ను దోచుకోలేద‌ని, దాచుకోలేద‌ని.. జ‌గ‌న్ దోచుకుంటున్నాడ‌ని చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు.

జ‌గ‌న్ పాల‌న‌లో రాష్ట్రం మ‌రో శ్రీలంక‌లా త‌యార‌వుతుందంటూ చంద్ర‌బాబు నాయుడు రొడ్డ కొట్టుడు ప్ర‌సంగం చేశారు. అయినా ఒక రాష్ట్రానికి ఇంకో దేశానికీ పోలిక ఏమిటో చంద్ర‌బాబు కానీ, ఆయ‌న బ్యాచ్ కానీ ఇప్ప‌టి వ‌ర‌కూ చెప్ప‌డం లేదు.

అంతూబొంతూ లేని పోలిక‌లు చెబుతూ.. త‌మ ప్ర‌త్య‌ర్థుల మీద వ్య‌తిరేక‌త పెంచే పాత ప‌ద్ధ‌తుల‌నే చంద్ర‌న్న అండ్ కో ఫాలో అవుతోంది. త‌న కుటుంబీకుల‌ను అవ‌మానించార‌ని, త‌న ఇంటిపై దాడి చేశారంటూ సానుభూతి పొందే ప్ర‌య‌త్నాలు ఇందుకు అద‌నం! ఇలా పాడిందే పాడుతూ కొత్త ప‌ర్య‌ట‌న‌ల‌ను చేప‌ట్టారు చంద్ర‌బాబు నాయుడు.

Show comments