కమ్మ ద్వేషి ఎవరు..? హిందూ ద్వేషి ఎవరు?

రాష్ట్రంలో దుండగులు విగ్రహాలు కూల్చితే జగన్ ను హిందూ ద్వేషి అన్నారు. రథాలు తగలబడితే హిందూ వ్యతిరేకి అన్నారు. ప్రతి చిన్న విషయానికి జగన్ మతాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అదే జగన్ హిందూ మతానికి పెద్ద పీట వేశారు. శ్రీ బాలాజీ జిల్లాను ఏర్పాటు చేస్తున్నారు. సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేస్తున్నారు. అన్నమయ్య పేరిట కొత్త జిల్లాకు నామకరణం చేశారు.

ఇది తాజా ఉదాహరణ మాత్రమే. ఇంకాస్త వెనక్కి వెళ్తే ఎన్నో ఆలయాల్ని అభివృద్ధి చేసిన ఘనత జగన్ ప్రభుత్వానిది. తెలుగుదేశం పార్టీ హయాంలో కూల్చిన లెక్కలేనన్ని దేవాలయాల్ని తిరిగి పునరుద్ధరించిన ట్రాక్ రికార్డ్ జగన్ ది. అంతెందుకు.. సరైన ఆర్థిక ఆసరా లేక ఇబ్బంది పడుతున్న అర్చకులకు, పోషణ లేని ఆలయాలకు నిధులు మంజూరు చేసింది జగన్. అదే అర్చకుల్లో చాలామందిని ఈబీసీ నేస్తం పథకంతో ఆదుకుంటున్న ఒకే ఒక్క ముఖ్యమంత్రి జగన్.

ఇప్పుడు కూడా జగన్ ను హిందూ ద్వేషి అందామా?  బీజేపీ ఆరోపిస్తున్నట్టు కేవలం ఒక వర్గానికే ముఖ్యమంత్రి కొమ్ము కాస్తున్నారంటే నమ్మేద్దామా?

మతం అయిపోయింది, ఇప్పుడు కులం విషయానికొద్దాం. రాష్ట్రంలో ఉన్న కమ్మ సామాజిక వర్గానికి బద్ధ శత్రువుగా జగన్ ను మార్చేందుకు కంకణం కట్టుకుంది టీడీపీ, దాని అను'కుల' మీడియా. నిజంగా ఎల్లో సోషల్ మీడియా చేస్తున్న ప్రచారంలో వాస్తవం ఉందా? కమ్మ కమ్యూనిటీ మొత్తాన్ని జగన్ ఇబ్బంది పెడుతున్నారా?

గల్లా జయదేవ్ ఫ్యాక్టరీ విషయంలో నిబంధనల ప్రకారం ప్రభుత్వం నడుచుకుంటే, అది కమ్మ కమ్యూనిటీపై దాడిగా చిత్రీకరిస్తే తప్పు ఎవరిది? సంగం డెయిరీ ప్రక్షాళన కోసం ముందుకొస్తే కమ్మ కులాన్ని అణగదొక్కినట్టు వార్తలు వండివార్చారు. 

ఒక దశలో హెరిటేజ్ పై విమర్శలు చేస్తే కమ్మ కులాన్నే జగన్ నాశనం చేస్తున్నారనేంతలా అక్కసు వెళ్లగక్కారు. చివరికి థియేటర్లలో తనిఖీలు చేసినా, కమ్మ కమ్యూనిటీనే టార్గెట్ చేశారనడం ఎంతవరకు కరెక్ట్? మరిప్పుడు వారి జాతికి చెందిన ఎన్టీఆర్ కు సమున్నత స్థానం కల్పించింది ఎవరు?

ఆంధ్రప్రదేశ్ లో ఓ జిల్లాకు ఏకంగా 'ఎన్టీఆర్ జిల్లా'గా నామకరణం చేసింది ఎవరు? ఇన్నాళ్లూ చంద్రబాబు ఈ పని  ఎందుకు చేయలేకపోయారు? ఎన్టీఆర్ కు అంతటి సముచిత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం జగన్ కు ఏంటి? కమ్మ వర్గీయుల మెప్పు జగన్ కు అవసరమా?

ఇదీ జగన్.. ఇప్పటికైనా గ్రహించండి

జగన్ కేవలం ఓ పొలిటీషియన్ కాదు, ఆయనో నాయకుడు. నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్న వ్యక్తి. ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న శ్రామికుడు. జగన్ కు కులం అంటదు, ఆయనకు మతం రంగు పులమలేరు. 

ప్రజల కోసం ఏదైనా చేయాలనే తపన మాత్రమే ఆయనలో కనిపిస్తోంది. ఇన్నాళ్లూ చేసిన రాజకీయాలు ఆయన దగ్గర నడవవు. అందుకే ఆయన పెద్దగా ఇలాంటి ఆరోపణలపై స్పందించరు. రెచ్చగొట్టినా చలించరు. 

Show comments