హిందువుల్ని కెలికిన ఉపాసన

హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన అనగానే మంచి ట్వీట్ లు, పోస్ట్ లు గుర్తుకు వస్తాయి. కానీ ఇప్పుడు ఓ పోస్ట్ కారణంగా ఆమె హిందువులకు టార్గెట్ అవుతున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఆమె ట్వీట్ చేసిన ఓ ఫొటో ఈ వివాదానికి కారణం అవుతోంది. నిజానికి ఆ ఫొటోతో ఆమెకు ఏ సంబంధం లేదు. 

తమిళనాడులోని ఓ భారీ ఆలయ గోపురం మీద శిల్పాలకు బదులు మనుషుల్ని పెద్ద సంఖ్యలో నిలబెట్టిన గ్రాఫిక్స్ పిక్చర్ అది. దాన్ని ఆమెకు తన తల్లి పంపిస్తే, వ్యాఖ్యానించండి అంటూ ఉపాసన ట్వీట్ వేసారు. అంతే కాదు తన వంతు క్యాప్షన్ జోడించారు.

అయితే ఆ క్యాప్షన్ లేదా కామెంట్ తో కాదు సమస్య. ఓ ఆలయ గోపురాన్ని ఇలా ఫొటోషాప్ చేయడంపైనే వచ్చింది తకరకారు.  జనాలను చెప్పులు, షూస్ వేసుకుని గోపురం మీదకు ఎక్కినట్లు చిత్రీకరించడం మీద నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతర మతాల ప్రార్ధనాలయాల మీద ఇలా ఫొటోషాప్ చేసి చూడండి ఏం జరుగుతుందో అని కామెంట్ చేస్తున్నారు.

అర్జెంట్ గా దీన్ని డిలీట్ చేయమని డిమాండ్ చేస్తునారు. అయితే రోజు గడచిపోయినా ఉపాసన ఈ వివాదం గురించి అస్సలు పట్టించుకోకపోవడం విశేషం. నిజానికి ఉపాసన చేసింది కచ్చితంగా తప్పదమే. హిందువులు ప్రవిత్రంగా చూసుకునే ఆలయ గోపురం మీద చెప్పులు, షూస్ వేసుకున్న మనుషుల్ని చిత్రీకరించడం అంటే కచ్చితంగా తప్పే. 

నెటిజన్లు మెగాస్టార్ ను రామ్ చరణ్ ను కూడా టార్గెట్ చేసి కామెంట్లు పెడుతున్నారు. కోడలికి సంస్కారం నేర్పలేదా అంటూ మెగాస్టార్ ను ప్రశ్నిస్తున్నారు. 

Show comments