సిధ్ శ్రీరామ్..అమ్మపాట

సిధ్ శ్రీరామ్ పాట అనగానే మాంచి రొమాంటిక్ మెలోడీలే ఎక్కువగా గుర్తుకువస్తాయి. నిజానికి ఎలాంటి మంచి పాట అయినా ఆయన గొంతులో అధ్భుతంగా పలుకుతాయి. కానీ మన సినిమా జనాలు ఎక్కువగా లవ్ సాంగ్స్ కే వాడుకుంటున్నారు. 

అయితే ఈసారి వెరైటీగా అమ్మ మీద మాంచి పాటను సిధ్ శ్రీరామ్ చేత పాడించారు ఒకే ఒక జీవితం సినిమా కోసం. శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్ లు తెలుగు-తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. 

కార్తీక్ అనే కొత్త దర్శకుడు పని చేస్తున్నారు. అమల కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమా కోసం కవి సిరివెన్నెల అమ్మ మీద ఓ అద్భుతమైన పాటను రచించారు. ఆ పాటను సిధ్ శ్రీరామ్ ఆలపించారు.

జేక్స్ బిజోయ్ చేసిన మెలోడీ ట్యూన్ కు తగినట్లు సిరివెన్నెల రాసిన గీతం బాగుంది. చాలా కాలం తరువాత సినిమాల్లో అమ్మ మీద పాట వినిపించింది. ఒక భిన్నమైన కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 

Show comments