మా తాతగారు...మా నాన్నగారు...ఏరీ?

తెలుగు సినిమా అభిమానుల్లో మహానటుడు ఎన్టీఆర్ ను ఏదో ఒక కోణంలో ఇష్టపడని వారు అంటూ వుండరు. నటుడిగా, పౌరాణిక పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసిన కళాకారుడిగా, ముఖ్యమంత్రిగా ఇలా ఏదో విధంగా. 

అలాంటి ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలన్నది చిరకాలపు డిమాండ్. చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పినపుడు కూడా అది సాధ్యం కాలేదు. 

పోనీ కనీసం ఆయన పుట్టిన ప్రాంతంలో ఆయన పేరిట జిల్లా అయినా ఏర్పాటు చేయగలిగారా? అదీ చాత కాలేదు. అలాంటిది వైఎస్ జగన్ ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటుచేసారు. రాజకీయ విబేధాలు ఎలాగైనా వుండొచ్చు. 

ఎన్నియినా వుండొచ్చు. కానీ ఇది ఎన్టీఆర్ అభిమానులకు, ఆయన సంతానానికి, ఆయన కుటుంబీకులకు ఎంతో ఆనందదాయకమైన విషయం. 

కనీసపు స్పందన తెలియచేయాల్సిన బాధ్యత కుటుంబీకుల మీద వుంటుంది కదా? తమ తండ్రి పేరిట జిల్లా ఏర్పాటు అయిందని, సంతోషం అని మొక్కుబఢిగా అయినా ఓ ప్రకటన ఇవ్వాలి కదా? అది కూడా చాతకాలేదా? ఆయన సంతానానికి. 

ఒ అంటే తాత..తాత అంటూ కలవరించే ఎన్టీఆర్ కు ఏమైంది ఓ ట్వీట్ వేయడానికి? మా నాన్నగారు..మా నాన్నగారు అంటూ కబుర్లు చెప్పే బాలయ్య కు ఏమైంది ఓ మాట అనడానికి? 

తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ జిల్లా అన్నది మింగుడుపడకపోవచ్చు. ఎందుకంటే తాము సాధించనది వైకాపా ప్రభుత్వం చేసిందని. అంత మాత్రం చేత ఎన్టీఆర్ అభిమానులు, ఆయన కుటుంబీకులు కూడా మౌనంగా వుండడం అంటే ఏమనుకోవాలి?

Show comments