వర్మ సెటైర్ మామూలుగా లేదుగా

'పెర్వర్టెడ్ జీనియస్' అని జనాలు ఫిక్స్ అయిపోయిన డైరక్టర్ ఆర్జీవీ మరోసారి తన మాటల చాతుర్యానికి తెర తీసారు.

గుడివాడ కేసినోల వ్యవహారం మీద ప్రశ్నించాల్సింది మంత్రి నానిని కాదని, ఎన్టీఆర్ ను అని పేర్కొంటూ ఒక యూ ట్యూబ్ లింక్ షేర్ చేసారు. ఇంతకీ ఎన్టీఆర్ కూ గుడివాడ కేసినోకి లింక్ ఏమిటా? అని జనం ఆ యూ ట్యూబ్ లింక్ ను క్లిక్ చేస్తే...

యమగోల సినిమాలో జయమాలిని ఐటమ్ సాంగ్ దర్శనమిచ్చింది. అందులో 'గుడివాడ వెళ్లాను..గుంటూరు పొయ్యాను' అంటూ జయమాలిని చేసిన అర్థనగ్న నృత్యం వుంది. అంటే ఆ రోజుల్లోనే గుడివాడలో ఛీర్ గర్ల్ డ్యాన్స్ లు వున్నాయంటూ ఎన్టీఆర్ తన సినిమాలో చెప్పారా? లేదా గుడివాడ, గుంటూరు అందుకు ఫేమస్ నా? అన్న అనేకానేక సందేహాలు వున్నాయి.

ఏమైనా సరే, ఎందులోంచి ఎందులోకో వెళ్లడంలో, టాపిక్ ను మార్చడంలో ఆర్జీవీ మహా ఘనుడు.

Show comments