మంత్రి కి మర్యాద ఇవ్వని నాగ్ !

మంత్రి కన్నబాబు మెగా క్యాంప్ కు సన్నిహితుడు. ఆ విధంగా నాగార్జునకు కూడా సన్నిహితుడే. పైగా కన్నబాబు సోదరుడు కళ్యాణ్ కృష్ణ నే బంగార్రాజు దర్శకుడు కూడా. నాగ్ బ్యానర్ కు మూడు హిట్ లు ఇచ్చాడు కళ్యాణ్. 

బంగార్రాజు బ్లాక్ బస్టర్ వేడుక రాజమండ్రిలో జరిగింది. ఈ వేడుకను ఆన్ లైన్ లో వీక్షించిన వారందరికీ ఒకటే అనుమానం. ఓ రాష్ట్ర మంత్రికి ఏ మేరకు మర్యాద, మన్నన ఇవ్వాలో ఆ ఈవెంట్ చేసిన వారికి కానీ హీరో నాగార్జునకు కానీ తెలియదా అనేదే?

ఈవెంట్లలో సాధారణంగా ముందు వరుసలో సోఫాలు వేస్తారు. వాటిల్లో 'పెద్దవాళ్ల'ను కూర్చోపెడతారు. అలా వేసిన సోఫాలు చాలకుంటే మరిన్ని తెప్పిస్తారు. బంగార్రాజు ఫంక్షన్ లో నాగ్ అండ్ కో సోఫాల్లో కూర్చుని, మంత్రి కన్నబాబును ఓ సింగిల్ ఆర్డినరీ కుర్చీలో కూర్చోపెట్టారు.

సాధారణంగా ముఖ్య అతిధిని వేదిక మీదకు పిలిచినపుడు వీలయినంత మధ్యలో వుండేలా చూస్తారు. ఇక్కడ కూడా కన్నబాబును ఓ పక్కకు పంపేసారు. నాగ్ తన స్పీచ్ లో కనీసం కన్నబాబు పేరు ప్రస్తావించాలని కూడా అనుకోలేదు. 

నాగ్ కు సిఎమ్ జగన్ సన్నిహితుడు కావచ్చు. కానీ కన్నబాబు లేకుంటే రాజమండ్రిలో ఫంక్షన్ జరిగేదా? పుష్ప సినిమా ఫంక్షన్ కు కాకినాడలో అనుమతి దొరకలేదు. కానీ బంగార్రాజకు రాజమండ్రిలో దొరికింది. నాగ్ కు సిఎమ్ తో ఎంత స్నేహం అయినా వుండొచ్చు. కానీ అలా అని మంత్రికి ఇవ్వాల్సిన మర్యాద మంత్రికి ఇవ్వాలి కదా?  

నాగ్ ది మొదటి నుంచీ ఇదే వైఖరి. హిట్ వస్తే అంతా తన ఘనత. ఫ్లాప్ వస్తే డైరక్టర్ బలైపోతాడు. భాయ్ సినిమా విషయంలో డైరక్టర్ వీరభద్రమ్ చౌదరిని అలాగే బలి చేసేసారు. ఇప్పటికి తేరుకోలేదు. మూడు హిట్ లు ఇచ్చిన కళ్యాణ్ వర్క్ ను కాస్తయినా గుర్తు పెట్టుకోవాలి కదా?

Show comments