ఆర్కే సందేహానికి సమాధానం ఇదిగో

అమరావతి ఉద్యమ ప్రతినిధులతో ముఖాముఖి నిర్వహిస్తూ ఆంధ్రజ్యోతి ఆర్కే ఓ ప్రశ్నవేసారు. కమ్మవారు అంటే కోస్తా జిల్లాల్లో మిగిలిన కులాల వారికి ఎందుకు కిట్టదో ఆత్మ పరిశీలన చేసుకున్నారా? అన్నది ఆ ప్రశ్న. ఈ విషయంలో ఆత్మపరిశీలన చేసుకుని, అందరినీ కలుపుకుని వెళ్లాలన్నది ఆయన సూచన. 

నిజమే. అసలు ఆత్మ పరిశీలన సంగతి అలా వుంచి ఎందుకు మిగిలిన వారికి కిట్టదో కొన్ని ఉదాహరణలు చూద్దాం.

ఉత్తరాంధ్రలోని ఓ ఫ్రధాన నగరంలో ఓ కమ్మ కుల గురువు లాంటి పెద్దాయిన ఓ స్టార్ హోటల్ పెట్టారు. అప్పటికే ఆ హోటల్ ఎదురుగా ఓ చిన్న రెస్టారెంట్ వుండేది. దానికి మంచి పేరు వుండేది. ఈయన హోటల్ లో రెస్టారెంట్ కు బేరాలు రావనో, లేక మరోటనో మెల్లగా తన పరిచయాలు వాడేసి, ఆ రెస్టారెంట్ లోకి ట్రేడ్ యూనియన్ రాజకీయాలు చొప్పించారు. సమ్మె వరకు తీసుకెళ్లారు. ఆఖరికి ఆ రెస్టారెంట్ మూత పడింది.

ఉత్తరాంధ్రలోని రెండు చిన్న నియోజకవర్గాలు. రెండు చోట్లా ఒక్కొక్క కమ్మ కుటుంబం. ఎన్టీఆర్ పార్టీ పెట్టగానే ఆ రెండు చోట్ల టికెట్ వారికే. మరి అక్కడ వేల కుటుంబాలు వున్నవారు ఏమవ్వాలి? వారికి అసంతృప్తి కలుగదా?

విశాఖ పార్లమెంట్ సీటు. ఎన్టీఆర్ పార్టీ పెట్టేవరకు లోకల్ జనాలదే. పార్టీ పెట్టిన తరువాత ఆ సీటు ఎక్కువ సార్లు కమ్మవారిదే. మరి లోకల్స్ కు మండదా?

కమ్మ పెద్దాయిన ఒకరు సిఎమ్ కాగానే హైదరాబాద్ నడిబొడ్డులోని హోటల్ మీద దృష్టి పడింది. అమ్మమని అడిగారు. ఆయన ససేమిరా అన్నారు. అంతే రాత్రికి రాత్రి హోటల్ మీద ఆంక్షలు పుట్టుకువచ్చేసాయి. మరి కమ్మవారంటే ఎలా ప్రేమ వుంటుంది ?

విశాఖలో కేంద్రం నిధులు అందుకుని శిక్షణా కార్యక్రమాలు నిర్వహించుకునే ఆర్గనైజేషన్ ఒకటి వుండేది. దాని మీద ఓ కమ్మ పెద్దాయిన కన్నుపడింది. అంతే ఫిర్యాదులు, విచారణలు వగైరాలు. సంస్థ చేతులు మారిపోయింది. దశాబ్దాలుగా ఆ చేతిలోనే వుంటోంది. మరి కొంతమందికి అయినా బాధ కలుగదా?

మన వ్యాపారాలు మనం చేసుకుంటే ఎవరికీ కొపం రాదు. బాధ వుండదు. కానీ అవతలి వారి అవకాశాల గుంజుకుంటేనే సమస్య. వ్యాపారాలు చంపేసి తమ వ్యాపారాలు నిలబెట్టుకోవడం, రాజకీయంగా అవకాశాలు అన్నీ గుంజుకోవడం. ఇలా చేస్తూ వుంటే స్థానికులకు ఎలా వుంటుంది? అందుకే కోస్తా జిల్లాల్లో కమ్మవారు అంటే కిట్టదు అని ఎబిఎన్ ఆర్కే లాంటి వాళ్లు అనే వరకు దారి తీసింది.

Show comments