నిలిచిపోయిన వాట్సాప్

దాదాపు సకల మానవాళి దారుణంగా అలవాటు పడిపోయిన వాట్సాప్ సేవలు ఒక్కసారిగా నిలిచిపోయాయి.

మొబైళ్లలో, డెస్క్ టాప్ ల్లో వాట్సాప్ మెసెంజర్ పని చేయకుండా ఆగిపోయింది. వాట్సాప్ తో పాటు దాని గ్రూప్ లో వున్న ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ లు కూడా ఆగిపోయాయి.

దాంతొ జనాలు అర్జెంట్ గా టెలిగ్రామ్ ను ఆశ్రయించారు. టెలిగ్రామ్ యాప్ లేనివాళ్లు అర్జెంట్ గా డౌన్ లోడ్ చేయడం ప్రారంభమైంది. మొత్తం మీద ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా చిన్న సంచలనం.

ఇదిలావుంటే కొంతమందికి ఈ సమస్య వున్నట్లు గుర్తించామని, అప్ డేట్ చేస్తున్నామని వాట్సాప్ ట్విట్టర్ లో తెలిపింది. 

Show comments