కలియుగ దైవం దర్శనానికి షరతులు

ఏ మాత్రం అవకాశం దొరికినా తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ప్రతి హిందువు అనుకుంటారు. ఏడు కొండలపై కొలువైన శ్రీవారి చెంత ఓంకార నాథం వింటూ ఆధ్యాత్మిక ప్రపంచంలో విహరించడం ప్రత్యేక అనుభూతి. 

ఇక మీదట తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే టీటీడీ కొత్త నిబంధనలను తాజాగా తెరపైకి తెచ్చింది. ఇక మీదట ఏడుకొండల వాడిని దర్శించుకోవాలంటే భక్తులు రెండు డోసులు పూర్తయిన సర్టిఫికెట్‌ లేదా మూడు రోజుల ముందు కరోనా నెగెటివ్‌ సర్టిఫికెట్‌ తేవాలని టీటీడీ పాలక మండలి చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి బుధవారం తెలిపారు. 

కోవిడ్‌ను అదుపు చేసేందుకే ఈ నిబంధన పెట్టినట్టు ఆయన వెల్లడించారు. టీటీడీ కొత్త నిబంధనను భక్తులు స్వాగతిస్తున్నారు. ఈ నెల 26 నుంచి కొత్త నిబంధన అమల్లోకి రానున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు.  

అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని టీటీడీ తీసుకున్న నిర్ణయానికి సహకరించాల్సిన బాధ్యత కూడా భక్తులపై ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Show comments