బ్రేకింగ్....జగన్ కు 'బంధనాలు'?

ఆంధ్ర రాజకీయ సర్కిళ్లలో కొత్త గ్యాసిప్ వినిపిస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి కొన్ని బంధనాలు తప్పవు అన్నది ఆ గ్యాసిప్. 

బంధనాలు అంటే జైలు..బెయిలు వ్యవహారాలు కాదు. ఆయన వ్యవహారాలకు బంధనాలు. ఏ రూపంలో వస్తాయో, ఎలా వస్తాయో అన్నది క్లారిటీగా డిస్కస్ చేయడం లేదు కానీ, ఆయనకు అడుగు అటు ఇటు పడకుండా కాస్త బంధనాలు పడబోతున్నాయనే గ్యాసిప్ వినిపిస్తోంది.

అది ఏ విధంగానైనా కావచ్చు. డబ్బుల లెక్కలు కావచ్చు. ఇబ్బందులు కావచ్చు. ఆయనకు కావాల్సిన వాళ్లను నియమించుకోవడం కావచ్చు. పదవులు ఇవ్వడం కావచ్చు. 

కచ్చితంగా కోర్టుకు ప్రతివారం హాజరుకావాల్సిన పరిస్థితులు కావచ్చు. ఇలా ఏ రూపంలో అయినా సరే కొన్ని 'కట్టుబాట్లు' తప్పవని, వాటికి అనుగుణంగానే ఆయన పాలన సాగించాల్సిన పరిస్థితి వస్తుందని వినిపిస్తోంది.

గతంలో మాదిరిగా ఆయనకు సంబంధించిన కేసుల్లో పేర్లు వున్న అధికారులు కావచ్చు, అనధికారులు కావచ్చు, ఇష్టం వచ్చినట్లు పదవుల్లో నియమించడం సాధ్యం కాకపోవచ్చని వినిపిస్తోంది. ఆ మేరకు ఆయనకు బ్రేకులు పడతాయని గ్యాసిప్ వినిపిస్తోంది. 

అమరావతి విషయమై జగన్ కు ఇష్టం వున్నా లేకున్నా, చంద్రబాబు రైతులకు ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేయాల్సిన పరిస్థితి వస్తుందని వినిపిస్తోంది. 

మొత్తం మీద తెరవెనుక ఏదో జరుగుతోందని..లేదా జరగబోతోందని, దాని వల్ల జగన్ కాస్త ఇబ్బందులు ఎదుర్కోనే అవకాశం వుందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఇవన్నీ జగన్ కు తెలియని కాదని, ఆయన అన్నింటికీ రెడీగానే వున్నారని కూడా టాక్ వినిపిస్తోంది. 

చూస్తుంటే ప్రస్తుతం చాలా స్తబ్దుగా వున్న ఆంధ్ర రాజకీయ వాతావరణం వేడెక్కుతుందేమో? మరి?

Show comments