ఇదే నా ఫుల్ లెంగ్త్ ప్రేమకథ - పూజా హెగ్డే

ప్రస్తుతం కెరీర్ లో పీక్ స్టేజ్ ను ఎంజాయ్ చేస్తోంది హీరోయిన్ పూజా హెగ్డే. క్యారెక్టర్స్, కథలతో సంబంధం లేకుండా బిగ్ బ్యానర్లు, బిగ్ స్టార్స్ ను టార్గెట్ చేస్తూ దూసుకుపోతోంది. అయితే ఎన్నో క్యారెక్టర్స్ చేస్తున్న తనకు ఫుల్ లెంగ్త్ లవ్ స్టోరీ పడలేదనే బాధ ఉండేదని, రాధేశ్యామ్ సినిమాతో ఆ కోరిక కూడా తీరిందని చెబుతోంది పూజ.

"ఇదొక మెచ్యూర్ లవ్ స్టోరీ. చాలా యాక్షన్ సినిమాలు చేసిన ప్రభాస్ నుంచి లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న రొమాంటిక్ మూవీ ఇది. ఇక నా విషయానికొస్తే.. నేను చాన్నాళ్లుగా ఓ ప్రాపర్ లవ్ స్టోరీ చేయలేదు. ఈమధ్య కాలంలో నేను చేసిన ఫుల్ లెంగ్త్ ప్రేమకథ ఇదే. అందుకే చాలా ఎగ్జయిటింగ్ గా ఉంది."

సినిమాలో తన పాత్ర గురించి చెప్పడానికి నిరాకరించింది పూజా హెగ్డే. రాధేశ్యామ్ లో తను చేసిన ప్రేరణ అనే పాత్ర గురించి ఇప్పుడే మాట్లాడలేనని, బహుశా సినిమా రిలీజ్ టైమ్ లో మాట్లాడతానని అంటోంది. ప్రభాస్-పూజా కాంబోలో వస్తున్న ఫస్ట్ మూవీ ఇదే.

పూజా హెగ్డే చెబుతున్న ప్రకారం.. రాధేశ్యామ్ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరో వారం రోజులు లేదా 10 రోజుల్లో టోటల్ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. థియేటర్లు పూర్తిస్థాయిలో తెరుచుకున్న తర్వాత నిర్మాతలు రిలీజ్ డేట్ పై ప్రకటన చేస్తారు.

Show comments