టికెట్ రేట్లు మారుతున్నాయా?

టాలీవుడ్ లో బర్నింగ్ టాపిక్ ఏమన్నా వుందీ అంటే అది ఆంధ్రలో సినిమా టికెట్ రేట్లు. టాలీవుడ్ సమస్యల్లో ఒకటి అయిన తెలంగాణలో పార్కింగ్ ఫీజు అన్నది పరిష్కారం అయిపోయింది. 

సింగిల్ స్క్రీన్ లు అన్నింటిలో పార్కింగ్ ఫీజుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అలాగే తెలంగాణలో నాలుగు ఆటలు, ఫుల్ గా వేసుకోవచ్చు. ఇక సమస్య లేదు.

మిగిలింది ఆంధ్రలో టికెట్ రేట్లు. సెకెండ్ షో అన్నవి. ఈ వారాంతానికి సెకెండ్ షో కి పర్మిషన్ వస్తుందని ఆశిస్తున్నారు. టికెట్ రేట్ల విషయంలో కూడా సిఎమ్ జగన్ సానుకూలంగా వున్నారని వార్తలు అందుతున్నాయి. కొన్నాళ్ల క్రితం ఇచ్చిన టికెట్ ల జీవో కు సవరణ జీవో త్వరలో వస్తుందని తెలుస్తోంది. 

అసలు సమస్య బి సెంటర్లలో రేట్లు. ఎందుకుంటే బి సెంటర్లే ఆంధ్రలో ఎక్కువ. వాటి రేట్లే కీలకంగా సవరించాల్సి వుంది. ఫ్రభుత్వం ఎ..బి సెంటర్లను క్లబ్ చేసి ఒకటే రేటు పెట్టే అవకాశం వుందని తెలుస్తోంది. 100-70-30 రూపాయల రేట్లు ఎ బి సెంటర్లలో వుండే అవకాశం వుంది. 

సి సెంటర్లకు వేరే రేట్లు వుంటాయి. అలాగే ఇకపై పెద్ద సినిమాలకు రేట్లు పెంచే అవకాశం వుండకుండా క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది. ఇది జరిగితే మాత్రం భారీ సినిమాలకు కాస్త సెట్ బ్యాక్ నే అవుతుంది. 

ఈ నెలాఖరు లోగా కొత్త జివో వస్తే మాత్రం ఇక ఆగస్టులో సినిమాలు ముంచెత్తడం పక్కా.

Show comments