విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ....ఓ బ్రహ్మ రహ్యస్యం....

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు సంబంధించిన వివరాలు చెప్పడానికి కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్ మెంట్ ససేమిరా అనేసింది.

అసలు ఉక్కు ప్రైవేటీకరణ కధ ఏంటని ఆర్టీఐ ద్వారా తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నానికి ఈ విధంగా ఆ విభాగం బ్రేకులు వేసింది. 

పెట్టుబడుల ఉపసంహరణ అంశం సమచార హక్కు చట్టంలోని సెక్షన్ 8 ఎ వన్ ప్రకారం ఆర్ధిక రహస్యాల పరిధిలోనికి వస్తుందంటూ నో చెప్పేసింది.

మొత్తానికి ఉక్కు కర్మాగారం విషయంలో అన్నీ రహస్యాలుగానే ఉన్నాయి. మరి అసలు విషయం తెలిసేది ఎలా అంటే ఏలిన వారు సెలవిస్తేనే అంటున్నారు. 

ఏది ఏమైనా విశాఖ ఉక్కు దక్కుతుందా అన్న దాని మీద ఎన్నో సందేహాలు ఉన్నాయి. ఉక్కు కార్మికుల పోరాటం అయితే గత నాలుగు నెలలుగా నిరాటకంగా కొనసాగుతోంది మరి.

Show comments