మళ్లీ నాగ్..చిరు డెలిగేషన్

కరోనా రెండో దశ ముగింపు దిశగా వెళ్తోంది. మళ్లీ థియేటర్లు తెరచుకునే రోజులు దగ్గరకు వచ్చాయి. ఈ మేరకు ఈ రోజు తెలంగాణ ఎగ్జిబిటర్లు సమావేశమయ్యారు.

థియేటర్లు తెరవడం మాత్రమే ముఖ్యం కాదు, సమస్యల పరిష్కారం కూడా అని ఎగ్జిబిటర్లు అభిప్రాయపడ్డారు. చిరకాలంగా పెండింగ్ లో వున్న సమస్యలను తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు.

ఈ మేరకు హీరోలు చిరు, నాగ్ లతో పాటు మంత్రి తలసానిని కలిసి, వారి ద్వారా సిఎమ్ కు సమస్యలను నివేదించాలని, థియేటర్లు తెరచుకునేలోగానే వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించారు. 

అయితే ఆంధ్ర ఎగ్జిబిటర్ల సంగతేమిటి అన్నది ఇంకా తెలియడం లేదు. కరోనా సెకెండ్ ఫేజ్ కు ముందు విజయవాడలో సమావేశం నిర్వహించారు. నిజానికి ఆంధ్రలో టికెట్ ల రేట్ల సమస్య అతి పెద్దది.

ఇప్పుడు వున్న రేట్ల పెద్ద సినిమాలకు అస్సలు కిట్టుబాటు కావు. అయితే అవి మారాలంటే సిఎమ్ జగన్ ను ఒప్పించాలి. అది ఎలా అన్నదే ఎగ్జిబిటర్ల ముందు వున్న అతి పెద్ద ప్రశ్న. మరి దానికి కూడా నాగ్, చిరు డెలిగేషన్ వుంటుందా? అన్నది చూడాలి.

Show comments