సెక్స్ కాలమ్ లోంచి పుట్టుకువచ్చిన కథ

మేర్లపాక గాంధీ..ఈ పేరు వినగానే మాంచి ఎంటర్ టైన్ మెంట్ సినిమాలు కళ్లముందుకు వస్తాయి. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా లాంటి హిట్ సినిమాలు గుర్తుకు వస్తాయి. ఆఫ్ కోర్స్ కృష్ణార్జునయుద్దం లాంటి మల్టీస్టారర్ కూడా గుర్తుకు వస్తుంది. బట్ ఏదయినా, ఫన్ అన్నది మెయిన్ ఇంగ్రీడియంట్. అది మిస్ అవ్వదు. 

అలాంటి మేర్లపాక గాంధీ తొలిసారి తన శిష్యుడు కార్తీక్ ను డైరక్టర్ గా పరిచయం చేస్తూ, తను స్క్రిప్ట్ అందించి, సూపర్ విజన్ చేస్తూ అందిస్తున్న సినిమా 'ఏక్ మినీ కథ'. అసలు ఆ మినీ అనే పదం చుట్టూనే వుంది వ్యవహారం అంతా. డిస్కస్ చేయడానికి కాస్త ఇబ్బందిపడే పాయింట్ తీసుకుని, రెండు గంటల సినిమా చేయడం అంటే ధైర్యం వుండాలి. ఆ ధైర్యం చేస్తున్న మేర్లపాక గాంధీతో చిన్న చిట్ చాట్.

ఏక్ మినీ కథ...మినీ అంటూనే పెద్ద విషయమే డిస్కస్ చేసినట్లున్నారు?

అవునండీ. నిజంగా పెద్ద విషయమే.

అసలు ఈ పాయింట్ మీద సినిమా చేయాలని ఎలా అనిపించింది?

మీకు తెలుసుకదా..మా ఫాదర్ స్వాతి వీక్లీకి రెగ్యులర్ రైటర్. ఇంటికి ఆ పుస్తకం వచ్చేది. అందులో సెక్స్ ప్రశ్నలకు సమాధానాలు వుండేవి. అందులో ప్రతివారం ఓ క్వశ్చను అయితే పక్కాగా వుండేది. నాది చిన్నగా వుంది..చిన్నగా వుంది..చిన్నగా వుంది. ఇదే చాలా మంది అనుమానం. ఇది అప్పట్లో నా బుర్రలో రిజిస్టర్ అయింది. కొన్ని నెలల క్రితం మళ్లీ స్వాతి చదువుతుంటే ఇదే ప్రశ్న. ఏంటీ టెక్నాలజీ ఇంతలా పెరిగినా, కాలం ఇంతలా మారినా, జనంలో ఈ అనుమానం పోవడం లేదా? ఆపై దీన్ని సెంటర్ పాయింట్ గా చేసుకుని కథ చేస్తే ఎలా వుంటుంది అని. అక్కడ నుంచి వర్కవుట్ చేసి కథ తయారుచేసాను.

అంతేనా..మీ ఫాధర్ నవలల స్టయిల్ లో ఓ సినిమా చేయాలనిపించిందా? 

అదేం లేదు. మా నాన్న అంటుంటాడు. నా కథలు బోలెడు వున్నాయి అని. కానీ నేనేదో నా స్టయిల్ లోనే వెళ్తున్నా.

మరి ఈ పాయింట్ ను మీ ఫాదర్ తో డిస్కస్ చేసారా?

ముందు పాయింట్ చెప్పాను. ఎందుకురా..నీ స్టయిల్ తో నువ్వు కంఫర్ట్ గా వున్నావు. మళ్లీ ఈ టైపు సినిమా అన్నారు. కానీ మొత్తం స్క్రిప్ట్ విన్నాక, చాలా బాగుంది అన్నారు.

ఏ హీరో ఇలాంటి పాయింట్ తో సినిమా చేయడానికి ఓకె అనరేమో అన్న కారణంగా సంతోష్ దగ్గరకు వెళ్లారా?

లేదు. కథ రాసుకున్నపుడే సంతోష్ ను తీసుకోవాలని వుండేది నాకు.

ఎందుకని..అతగాడు ఏమీ అంత లైమ్ లైట్ లో లేడుకదా.

నిజమే కానీ పేపర్ బాయ్ చూసిన తరువాత సంతోష్ కు ఈ క్యారెక్టర్ పెర్ ఫెక్ట్ అనిపించింది. చెప్పాను. ఓకె అన్నాడు. అప్పుడు యువి వాళ్లకు చెప్పాను. నిజానికి అంతకన్నా ముందు నా సహచరుడు రమేష్ మహర్షికి కూడా చెప్పాను. ఈ తరహానా అన్నాడు. కానీ మళ్లీ మొత్తం విన్నాక అతనూ ఓకె అన్నాడు.

ఓటిటి లో విడుదలవుతోంది. కరెక్ట్ అంటారా? థియేటర్ అయితే ఎలా వుండేదో?

థియేటర్ అయితే భలేగా వుండేది. కచ్చితంగా అందరూ ఎంటర్ టైనర్ అయ్యేవారు. కానీ మరో మూడు నెలల వరకు అవకాశం లేదంటున్నారు. అందుకే ఓటిటికి ఇవ్వక తప్పలేదు.

కేవలం టెక్నికల్ రీజన్లు, ఆబ్లిగేషన్లతో దర్శకత్వ పర్యవేక్షణ అనే కార్డ్ నా? నిజంగా శిష్యుడికి అవకాశం ఇవ్వాలనా?

నిజంగానే ఇవ్వాలని. నాతో రెండు సినిమాలకు పని చేసాడు. అందుకే.

కానీ మీరు కూడా చేసింది మూడు సినిమాలే కదా. అప్పుడే మీరు కూడా 'రైటింగ్స్' అంటూ..

అమ్మో..అంత లేదు. జస్ట్ నాకు మాస్ట్రో కమిట్ మెంట్ వుంది. ఈ లోగా ఈ సినిమా ఐడియా వచ్చింది. దాంతో కార్తీక్ కు అవకాశం ఇచ్చాను.

మాస్ట్రో సంగతులేమిటి? మరోసారి మీవి కాని షూస్ లో కాళ్లు పెడుతున్నట్లున్నారు?

అందులో కోర్ పాయింట్ నచ్చింది. ఎక్స్ ట్రా మారిటల్ ఎఫైర్ లోంచి వచ్చిన కథ కదా..అందుకనే టేకప్ చేసాను.

ఓటిటి వచ్చిన తరువాత అందరూ అన్ని సినిమాలు చూస్తున్నారు. అలాంటి నేపథ్యంలో ఓ భాషలో పెద్ద హిట్ అయిన సినిమాను మరో భాషలో తీయడం సవాలుగా వుంటుంది కదా.

నిజమే. నేను సిన్సియర్ ఎటెంప్ట్ చేస్తున్నా. కచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నా.

కృష్ణార్జునయుద్దం తరువాత చాలా గ్యాప్ వచ్చింది

ఇకపై రాదు. ఎడాపెడా సినిమాలు తీస్తా

ఎడాపెడా అంటే..

థియేటర్ కు..ఓటిటికి.

ఏమైనా రెడీ చేసారా ఓటిటి కోసం. 

చేస్తున్నా...అలాగే మెయిన్ స్ట్రీమ్ కోసం కూడా.

ఎప్పుడో ఓసారి రామ్ చరణ్ తో సినిమా అని వినిపించింది అదేమయింది.

అనుకున్నాం. లైన్ కూడా చెప్పాను. ఇంకా సమ్ థింగ్ మోర్ అన్నారు. చూడాలి.

పెద్ద హీరో కదా..యాడెడ్ స్పయిస్ వుండాలేమో

అంతే కదా..

మీ సినిమాల స్క్రిప్ట్ లు మీ ఫాదర్ కు చెప్తుంటారా?

చెప్తుంటాను. ఆయన స్టయిల్ వేరు. వీలయినపుడల్లా కాస్త ఆ 'టచ్' ఇవ్వాలంటారు. నిజానికి నా ఫస్ట్ సినిమా స్క్రిప్ట్ విని వీడు మొదటి సినిమాతోనే డింకీ కొట్టేస్తున్నాడు అనుకున్నారు.

కానీ తప్పు అని రుజువు చేసారు కదా.

అవును. అందుకే అప్పటి నుంచి సినిమా స్క్రిప్ట్ ల మీద ఆయన థాట్ ప్రాసెస్ మారింది. 

మాస్ట్రో తరువాత పెద్ద సినిమా ఎప్పుడు మళ్లీ..

వుంటుంది..వివరాలు త్వరలో చెబుతాను

లాస్ట్ క్వశ్చను...ఇంతకీ ఎన్ని ఇంచీలు పెంచారు..నాలుగా...ఆరా? పదా?

హ్హ..హ్హ..హ్హ...అదేం లేదు. అదంతా భ్రమ..మందులు, మూలికలు, ఆపరేషన్లు అంతా భోగస్..ఆ క్లారిటీ ఇచ్చాం అంతే.

-విఎస్ఎన్ మూర్తి.

Show comments