ఉప్పెన హీరోయిన్ ఇష్టాఇష్టాలు

ఉప్పెనతో క్రేజీ హీరోయిన్ అయిపోయింది కృతి షెట్టి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో 3 సినిమాలున్నాయి. రీసెంట్ గా వచ్చిన పుకార్లు కూడా ఖండించింది కృతి. కొత్త సినిమాలేం ఒప్పుకోలేదని స్పష్టంచేసింది. ఇక కృతి షెట్టికి ఇష్టమైనవేంటో.. ఆమె పర్సనల్ డీటెయిల్స్ ఏంటో చెక్ చేద్దాం.

- ఎప్పుడూ బ్యాగ్ లో ఉండే 3 ఐటెమ్స్?

ఫోన్, లిప్ బామ్, డబ్బులు

- ఒంటిపై ఎన్ని టాటూస్ ఉన్నాయి..?

నాకు ఎక్కడా, ఎలాంటి పచ్చబొట్లు లేవు.

- రోజంతా 3 పనులు చేయాలంటే..?

కడుపు నిండా తింటాను, నిద్రపోతాను.. ఇంకా టైమ్ ఉంటే డాన్స్ చేస్తాను.

- ఇష్టమైన కొటేషన్?

హ్యాపీనెస్ ఈజ్ ద ఫైనల్ డెస్టినేషన్

- నీ వయసెంత?

అమ్మాయిల వయసు అడక్కూడదు. కానీ చెబుతాను. నేను 16, 17, 18 ఏజ్ గ్రూప్ లో ఉన్నాను.

- నేర్చుకోవాలనుకుంటున్న యాప్?

ట్విట్టర్ లో నేను అంత పెర్ ఫెక్ట్ కాదు.. దాని గురించి ఇంకాస్త నేర్చుకోవాలనుకుంటున్నాను.

- చిన్నప్పుడు స్కూల్ ఎగ్గొట్టాల్సి వస్తే..?

అందరిలా సాకులు చెప్పేదాన్ని కాదు. బాగా నిద్రపోతే నాన్న లేపేవారు కాదు. లేచిన తర్వాత స్కూల్ కు వద్దులే అని చెప్పేవారు. పైగా ఆరోజు నన్ను మెక్ డొనాల్డ్స్ కు తీసుకెళ్లేవారు.

- యాడ్స్ చేయడం ఎప్పట్నుంచి?

13 ఏళ్లకే యాడ్స్ చేయడం స్టార్ట్ చేశాను. అక్కడే చాలా నేర్చుకున్నాను. టాలీవుడ్ కు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ నేర్చుకునే అవకాశం దక్కింది.

- జీవితంలో బాగా టీజ్ చేసిన వ్యక్తి?

నన్ను ఇప్పటివరకు బాగా టీజ్ చేసిన వ్యక్తి వైష్ణవ్ తేజ్ మాత్రమే. వైష్ణవ్ అంతలా ఎవ్వరూ నన్ను ఏడిపించలేదు. ఉప్పెన షూటింగ్ జరిగినన్ని రోజులు నన్ను టీజ్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ ఇంకా చేస్తూనే ఉన్నాడు

- మొదటి హీరో వైష్ణవ్ తేజ్ గురించి 3 ముక్కల్లో?

సింపుల్ గా ఉంటాడు.. హ్యాండ్సమ్ గా ఉంటాడు.. ఏ విషయంపైనైనా గట్టిగా నిలబడతాడు.

- రిలేషన్ షిప్ లో ఎలా ఉంటే నచ్చదు..?

రిలేషన్ షిప్స్ లో ఎవరైనా అగౌరవంగా, అమర్యాదగా ప్రవర్తిస్తే నాకు అస్సలు నచ్చదు. అలాంటివాళ్లకు వెంటనే దూరంగా జరుగుతాను. అబద్ధాలు చెప్పేవాళ్లంటే కూడా నాకు ఇష్టం ఉండదు.

Show comments