హీరోలూ నంద్యాల రవిని ఆదుకోండి

హీరోయిజం అంటే మేకప్ కొట్టుకుని, డమ్మీ ఫైట్లు చేసి ప్రేక్షకుల దృష్టిలో వీరులు అనిపించుకోవడం కాదు. ఆపదలో వున్నవారిని ఆదుకోవడం. అంటే విలన్ వేషాలు వేసే సోనూ సూద్ చేస్తున్నట్లు అన్నమాట. 

టాలీవుడ్ లో హీరోల సంగతి ప్రత్యేకంగా విడివిడిగా చెప్పనక్కరలేదు. ఎవరెంత హీరోలో అందరికీ తెలిసిందే. విషయానికి వస్తే రచయిత నంద్యాల రవి కోవిడ్ తో బాధపడుతున్నారు. 

కేవలం ఒకరిద్దరు మాత్రం సకాలంలో ఆదుకుని ఆసుపత్రిలో చేర్పించారు. దర్శకుడు శ్రీవాసు, ఐరా క్రియేషన్స్ తదితరులు ఇప్పటి వరకు అతని ఆసుపత్రి వ్యవహారాలు చూస్తూ వస్తున్నారు. ఇప్పుడిప్పుడే సీరియస్ కండిషన్ నుంచి తేరుకుంటున్నాడు.

కానీ విషయం ఏమిటంటే ఇప్పుడు ఆరేడు లక్షల బిల్లు చెల్లించాల్సి వుంది. ఇది ఎవరు కడతారు? నంద్యాల రవి కుటుంభానికి అంతటి స్తోమత లేదు. హీరోలు అంతా తలా యాభై వేలు ఇచ్చినా పని జరిగిపోతుంది. లేదా సిసిసి నుంచి బిల్లు చెల్లించిన సరిపోతుంది. కానీ ఇందుకోసం పూనుకునేదెవరు?

కేవలం ప్లాస్మా, బ్లడ్ లాంటి నలభై వేల రూపాయల ఖర్చు భరించి చేతులు దులుపేసుకుంటే సరిపోతుందా? కరోనా టైమ్ లో ట్విట్టర్ లో తెగ ప్రవచనాలు చెప్పే బదులు, ఇలా కష్టంలో వున్నవారిని ఆదుకుంటే మంచిది కదా?

Show comments