అనున్నంతా అయ్యిందా..నానీ?

హీరో నాని లేటెస్ట్ సినిమా శ్యామ్ సింగ రాయ్. కరోనా కల్లోలం ముంచుకు వచ్చి దాదాపు అన్ని సినిమాల షూట్ లు నిలిపివేసినా, ఆ సినిమా షూట్ మాత్రం ముందుకే సాగింది. 

భారీ సెట్ వేయడం, భారీగా కలకత్తా నుంచి జూనియర్ ఆర్టిస్ట్ లను రప్పించడం వంటి కారణాలతో అంతా వృధా అయిపోతుందని ముందుకే వెళ్లారు. కానీ ఇప్పుడేమయింది షూటింగ్ నిలిపివేయాల్సి వచ్చింది. 

యూనిట్ లో కీలక బాధ్యులు పలువురికి కరోనా సోకడంతో షూటింగ్ ను నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఎవరికి వారిని హొమ్ ఐసోలేషన్ లో వుంచి ట్రీట్ మెంట్ చేయిస్తున్నారు. దీంతో దాదాపు టాలీవుడ్ లో నూటికి నూరుశాతం షూటింగ్ లు నిలిచిపోయినట్లే. 

టాలీవుడ్ లో కూడా కరోనా కలకలం సృష్టిస్తోంది. పలువురు కరోనా బారిన పడుతున్నారు. చాలా మంది ఇంటి వద్దే రికవరీ అవుతున్నారు. కొద్ది మంది మాత్రం ఆసుపత్రి పాలవుతున్నారు.

Show comments