అదిగో పూజా..ఇదిగో దిశ

అదిగో సినిమా అంటే ఇదిగో హీరోయిన్ అనడం మన జనాలకు అలవాటే. పెద్ద సినిమా, క్రేజీ కాంబినేషన్ అంటే ఊహాగానాలు ఓ రేంజ్ లో వుంటాయి. మహేష్-త్రివిక్రమ్ సినిమా అంటే ఎప్పుడో మరో నాలుగు నెలల తరువాత సంగతి. ముహుర్తం కోసం ఇన్నాళ్లు ఆగారు. 

లేదూ అంటే ఎన్టీఆర్-కొరటాల శివ సినిమా ప్రకటించినపుడే త్రివిక్రమ్-మహేష్ సినిమా ప్రకటించాల్సి వుంది. కరోనా పరిస్థితులు చక్కబడాలి. సర్కారు వారి పాట సినిమా ఓ కొలిక్కి రావాలి. త్రివిక్రమ్ వన్ లైన్ ఆర్డర్ రెడీ చేయాలి. అన్నింటికి మించి అప్పుడు ఎవరి డేట్ లు అందుబాటులో వుంటాయో చూడాలి. అప్పుడు మహేష్ బాబు సరసన ఎవరు హీరోయిన్ అన్నది తేలుతుంది.

ఈలోగా మళ్లీ పూజానే అన్నది ఓ వార్త. నిజానికి పూజా ఎప్పుడూ త్రివిక్రమ్ ఓ ఆప్షన్ గానే వుంటుంది. ఎందుకంటే ఎప్పుడు డేట్ లు కావాలన్నా ఏదో విధంగా అడ్జస్ట్ చేసి మరీ నటించడానికి సిద్దం కాబట్టి. కానీ వేరే హీరోయిన్ల మీద కూడా దృష్టి వుంది. 

ఎన్టీఆర్ తో సినిమా అనుకున్నపుడు హీరో కోరిక మేరకు కియారా కోసం ప్రయత్నించారు. ఇప్పుడు అదే కియారా ఎన్టీఆర్ తోనే కొరటాల శివ సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వున్నాయి. మరి మహేష్ కోసం ఆమెను అడుగుతారా? లేక వేరే వాళ్లనా? అన్నది ఓ పాయింట్.

శ్రీదేవి కూతరు జాహ్నవిని తెలుగులో పరిచయం చేయాలని హారిక హాసిని కి ఎప్పటి నుంచో ఆసక్తి వుంది. ఇలా మరి కొన్ని పేర్లు కూడా లైన్ ఆఫ్ ఆర్డర్ లో వున్నాయి. ఎటొచ్చీ ఇవన్నీ కూడా షూటింగ్ టైమ్, డేట్ లు, పరిస్థితులు, ఆపై హీరో సజెషన్ బట్టి వుంటాయన్నది యూనిట్ వర్గాల బోగట్టా. 

Show comments